Harmanpreet Kaur : టీ20ల్లో హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత..
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అరుదైన ఘనత సాధించింది.
Harmanpreet becomes second Indian after Smriti Mandhana to score 4000 runs in womens T20Is
- టీ20ల్లో 4వేల పరుగుల మైలురాయిని చేరుకున్న హర్మన్ ప్రీత్ కౌర్
- స్మృతి మంధాన తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్గా
- ఓవరాల్గా మూడో ప్లేయర్గా రికార్డుల్లోకి
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. శనివారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఈ ఘనత అందుకుంది.
టీ20క్రికెట్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత క్రికెటర్గా, ఓవరాల్గా మూడో ప్లేయర్గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డులకు ఎక్కింది. భారత్ తరుపున హర్మన్ కన్నా ముందు స్మృతి మంధాన మాత్రమే టీ20ల్లో 4వేల పరుగుల మైలురాయిని చేరుకుంది.
Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభవ్ బ్యాటా మజాకానా.. 12 కోట్లు..
ఇక ఓవరాల్గా.. సూజీ బేట్స్, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్లు మాత్రమే మహిళల టీ20క్రికెట్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటారు. ఇక ఈ మ్యాచ్లో హర్మన్ 22 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసింది.
మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 183 మ్యాచ్ల్లో 4720 పరుగులు
* స్మృతి మంధాన (భారత్) – 165 మ్యాచ్ల్లో 4325 పరుగులు
* హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 196 మ్యాచ్ల్లో 4019 పరుగులు
* చమరి ఆటపట్టు (శ్రీలంక) – 157 మ్యాచ్ల్లో 3752 పరుగులు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 154 మ్యాచ్ల్లో 3719 పరుగులు
ఇక రెండో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. ఫ్రెయా కెంప్ (13 బంతుల్లో 39 నాటౌట్), డానీ వైట్-హాడ్జ్ (29), అమీ జోన్స్ (28), ఆలిస్ క్యాప్సే (28) లు రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగలు చేసింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, నందని శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీశారు.
An incredible player joins an elite club ✨#TeamIndia Captain Harmanpreet Kaur becomes just the 2️⃣nd Indian and 3️⃣rd player overall to amass 4️⃣0️⃣0️⃣0️⃣ T20I runs 👏🫡
Updates ▶️ https://t.co/qaQTNLMyMq#ENGvIND | @ImHarmanpreet pic.twitter.com/saG1mfnQj0
— BCCI Women (@BCCIWomen) May 30, 2026
ఆ తరువాత 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (32), యస్తిక భాటియా (33) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్, షార్లెట్ డీన్, ఫ్రేయా కెంప్ లు తలా రెండు వికెట్లు తీశారు. సోఫీ ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టింది.
