Buchi Babu Sana : ఆ కటౌట్ వైరల్ అవ్వడంతో.. ఒరేయ్ అంటూ.. చరణ్ ఫ్యాన్స్ పై బుచ్చిబాబు రియాక్షన్..
ఈ సినిమా, చరణ్ కి ఉన్నంత హైప్ ఫ్యాన్స్ డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఇస్తున్నారు. (Buchi Babu Sana)
Director Buchi babu Sana Reaction On Viral Cutouts
Buchi Babu Sana : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా, చరణ్ కి ఉన్నంత హైప్ ఫ్యాన్స్ డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఇస్తున్నారు.
ఉప్పెన లాంటి బిగ్ హిట్ కొట్టిన తర్వాత ఇది రెండో సినిమా కావడం, ఈ సినిమా విజువల్స్ బాగుండటం, బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా సినిమా గురించి మాట్లాడుతుండటం, ఎక్కడ కనపడినా చాలా వినయంగా ఉండటం, చరణ్, చిరులతో కూడా బుచ్చిబాబు కనపడి వైరల్ అవ్వడం, చరణ్ తో సరదాగా మాట్లాడుతూ వీడియోలు చేయడంతో బుచ్చిబాబుని కూడా ఫ్యాన్స్ తమ సొంతం చేసుకొని పొగిడేస్తున్నారు.
Also Read – Peddi First Review : ‘పెద్ది’ సినిమా ఫస్ట్ రివ్యూ.. చరణ్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడు?
ఈ క్రమంలో కొంతమంది ఫ్యాన్స్ బుచ్చిబాబుకు కూడా కటౌట్స్ పెట్టారు. అవి కూడా మాములు కటౌట్స్ కాదు బట్టలు లేకుండా కుస్తీ పోటీలకు రెడీ అయినట్టు. పెద్ది సినిమా కుస్తీ బ్యాక్ డ్రాప్ కావడంతో అందుకు తగ్గట్టు కేవలం ప్రైవేట్ పార్ట్ మాత్రం కప్పి ఉంచేలా చరణ్ మాస్ విజువల్స్ రిలీజ్ చేసారు. దీంతో బుచ్చిబాబుకి కూడా కేవలం ప్రైవేట్ పార్ట్ కవర్ చేసి కుస్తీ పోటీలకు సిద్దమైన వీరుడిలా, కండలు చూపిస్తున్న కటౌట్స్ చేయించారు చరణ్ ఫ్యాన్స్.
రెండు రోజుల క్రితం విజయవాడలో చరణ్ ఫ్యాన్స్ ఈ కటౌట్ ని ఆవిష్కరించారు. దీంతో బుచ్చిబాబు కటౌట్ కూడా వైరల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బుచ్చిబాబు కటౌట్ పట్టుకొచ్చారు కొంతమంది ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సాన ఈ కటౌట్ పై స్పందిస్తూ.. ఒరేయ్ కనీసం బట్టలు అయినా వేయండ్రా. మంచి బట్టలు వేసి పెట్టండిరా కటౌట్స్ పెడితే. ఇలా ఏంటి. ఫ్యాన్స్ ఒకసారి పొగుడుతారు, ఒకసారి తిడతారు. వాళ్ళు ఏది చేసినా ప్రేమే అని అన్నారు.

Also Read – Peddi: ఇదెక్కడి క్రేజ్ రా మామా.. అర్జున్ థియేటర్ లో రామ్ చరణ్ గుడి.. పూజలు చేస్తున్న మెగా ఫ్యాన్స్
View this post on Instagram
