Health Care : యూరియాతో పండిన ఆహారంతో యువతలో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం.. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా..
Health Care : తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ సంచలన విషయాన్ని వెల్లడించారు. రైతుల అధిక యూరియాతో పండించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉందని అన్నారు.
Health care
- రైతులు అవసరానికి మించి యూరియా వాడొద్దు
- అధిక యూరియా వాడకంతో పండిన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు
- యువతలో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం
Health Care : పెళ్లైన జంటల్లో చాలా మంది సంతానలేమి సమస్యల (Infertility problems)ను ఎదుర్కొంటున్నారు. గర్భంకోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి ఎనిమిది జంటల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయస్సు పెరిగే కొద్దీ సహజ సంతాన సామర్థ్యం (Natural fertility) తగ్గుతుందని.. ధూమపానం, మద్యం సేవించడం, అధిక కెఫిన్ తీసుకోవడం వంటి తదితర కారణాల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని వైద్యులు చెబతుంటారు. అయితే, తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత
తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ సంచలన విషయాన్ని వెల్లడించారు. రైతుల అధిక యూరియా (Urea) తో పండించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉందని అన్నారు. అధిక యూరియా వాడకంతో పండిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తాయని, యువతలో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ నివేదికలో ఈ అంశం పేర్కొన్నట్లు తెలిపారు.
రైతులు సాగు చేసిన పంటలకు అవసరానికి మించి యూరియాను వాడొద్దని వీసీ అల్దాస్ జానయ్య సూచించారు. యూరియా ఎక్కువగా వాడితే అధిక దిగుబడులు వస్తాయనే అపోహ వల్ల రైతులు యూరియా ఎక్కువగా వాడుతున్నారని, అది సరికాదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
అధిక యూరియా వాడకం వల్ల దిగుబడులు పెరగకపోగా.. పంటల్లో రసాయన అవశేషాలు నిండిపోయి మానవ ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని, శాస్త్రీయ ప్రయోగాలు దీనిని నిరూపించాయని ఆయన వెల్లడించారు. పంటలకు నత్రజని అవసరమే .. కానీ, దానికి యూరియా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదని, చౌకగా దొరుకుతుందనే కారణంతో కొందరు పంటలకు ఎక్కువగా యూరియా అందిస్తున్నారని, యూరియా మోతాదుకు మించి వాడొద్దని జానయ్య సూచించారు.
