Ashok Dinda: బెంగాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీమ్ఇండియా మాజీ పేసర్ అశోక్ దిండా..
Ashok Dinda Sworn: టీమ్ఇండియా మాజీ పేసర్ అశోక్ దిండా (Ashok Dinda) పశ్చిమ బెంగాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Former India fast bowler Ashok Dinda took oath as a West Bengal minister
Ashok Dinda : టీమ్ఇండియా మాజీ పేసర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పశ్చిమ బెంగాల్లోని మోయినా నియోజవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి అయిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)కు చెందిన చందన్ మండల్ పై 16,241 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 1 తొలి మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. ముఖ్యమంత్రి సువెందు నేతృత్వంలో 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ దిండాతో సహా మిగిలిన వారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు.
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తరువాత అశోక్ దిండా 2021లో బీజేపీలో చేరారు. అదే ఏడాది మోయినా స్థానం నుంచి పోటీ చేసి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సంగ్రామ్ కుమార్ డోలాయ్ పై 1,260 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సారి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు.
2009 నుంచి 2013 వరకు టీమ్ఇండియాకు అశోక్ దిండా ప్రాతినిధ్యం వహించాడు. 13 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 12 వికెట్లు పడగొట్టగా, టీ20ల్లో 17 వికెట్లు సాధించాడు. ఇక 2008 నుంచి 2017 వరకు ఐపీఎల్లో 78 మ్యాచ్లు ఆడాడు. 69 వికెట్లు సాధించాడు.
