First Time Review : ‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ.. పాయల్ రాజ్పుత్ బాయ్ ఫ్రెండ్ హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?
ప్రపంచం అంతం అయిపోయి కొత్త ప్రపంచం ఎలా మొదలయింది అనే ఆసక్తికర పాయింట్ ని ఈ సినిమాలో చూపించారు. (First Time Review)
First Time Review
First Time Review : సౌరబ్ ధింగ్ర, అఖిల్ సార్థక్, అనిక విక్రమన్.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘ఫస్ట్ టైం’. హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ ఇప్పలపల్లి దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ టైం సినిమా నేడు మే 22న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
కొంతమంది ఏలియన్స్ భూమిని ఆక్రమించుకోవాలని వస్తారు. ఆ సమయంలో కొన్ని ఆత్మలు భూమి మీద జరిగిన ఓ కథని ఏలియన్స్ కి చెప్తారు. అలా ఆద్య(అనికా విక్రమన్), ఆమె వెంట పడే మనుషులు, ఆమెని కాపాడిన ఆది(అఖిల్ సార్థక్/సౌరబ్ ధింగ్ర) అతనితో ఇష్టం, వీళ్ళు ఇద్దరూ ఓ సముద్రంలో చిక్కుకోవడం గురించి చెప్తారు.
అదే సమయంలో ప్రపంచంలో అందరూ చనిపోయి ఆది, ఆద్య ఇద్దరే ఓ దీవిలో మిగులుతారు. మరోవైపు కొంతమంది ఆస్ట్రోనాట్స్ కథ సాగుతుంది. అసలు ప్రపంచం ఎలా అంతమైంది? కొత్త ప్రపంచం ఎలా మొదలవుతుంది? ఏలియన్స్ భూమిని దక్కించుకున్నారా? ఆది ఫేస్ ఎలా మారిపోయింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Memu Coplam Review : ‘మేము కాప్లం’ వెబ్ సిరీస్ రివ్యూ.. సలార్ రాజు మిస్సింగ్..
సినిమా విశ్లేషణ..
దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ వాడి హాలీవుడ్ రేంజ్ లో ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేసారు. ప్రపంచం అంతా అంతమయిపోయి మళ్ళీ కొత్త సృష్టి మొదలయితే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ ని రాసుకున్నారు కానీ దాన్ని తెరకెక్కించడంలో తడబడ్డారు. ఫ్లాష్ బ్యాక్ ఆద్య – ఆది కథ రెగ్యులర్ కమర్షియల్ కథలాగానే ఉంటుంది. ఆది తప్పితే మిగతా అంశాలు, విజువల్ గా చూడటానికి కూడా ఆసక్తిగానే సాగుతాయి.
నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చెప్పడంతో అక్కడక్కడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినా సెకండ్ హాఫ్ లో ట్విస్టులు, అసలు కథతో ఆసక్తిగా నడిపిస్తారు. ఏలియన్స్ విజువల్స్ ఆసక్తికరంగా ఉంటాయి. హ్యూమన్ ఇంటిలిజెన్స్, VFX ద్వారానే ఈ సినిమాలో చాలా సీన్స్ తెరకెక్కించారు. హీరో ఫేస్ మారిపోవడం ఇంకాస్త కన్విన్స్ గా చెప్తే బాగుండేది. ఇక రొమాన్స్ ని కూడా కథకి తగ్గట్టు బాగానే చేర్చారు. దీవిలో ఉన్న మనుషులే భూమి మీద మిగిలారు అంటే ఇంకాస్త ఆసక్తిగా సీన్స్ రాసుకునే అవకాశం ఉంది కానీ సింపుల్ సీన్స్ తోనే నడిపించారు. ప్రపంచం అంతం అయిపోయి కొత్త ప్రపంచం ఎలా మొదలయింది అనే ఆసక్తికర పాయింట్ ని ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 సీక్వెల్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
పాయల్ రాజ్ పుత్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించాడు. మరో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ కూడా బాగానే నటించాడు. అనిక విక్రమన్ అందంతో అలరిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో మెప్పిస్తుంది. భూపాల్ రాజు, శివకుమార్, మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Ugly Story Review : ‘అగ్లీ స్టోరీ’ మూవీ రివ్యూ.. వామ్మో ఇదెక్కడి సైకో ప్రేమకథ..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. AIని కాకుండా VFX తోనే అద్భుతమైన విజువల్స్ ఇచ్చే ప్రయత్నం చేసారు. కథ కథనం విషయంలో ఇంకాస్త క్లారిటీగా రాసుకోవాల్సింది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఫస్ట్ టైం’ సినిమా కొత్త కాన్సెప్ట్ కి రెగ్యులర్ కమర్షియల్ అంశాలు జోడించి హాలీవుడ్ రేంజ్ లో చూపిద్దామనుకున్నారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
