Michael OTT: ఓటీటీకి వచ్చేస్తున్న గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘మైఖేల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా రూ.7000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మైఖేల్ (Michael OTT)సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధం అయ్యింది.
Michael Jackson Biopic Michael movie Is Ready to Stream on Bookmyshow OTT
- మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీకి సిద్ధం.
- జూన్ 9 నుండి డిజిటల్ విడుదల.
- ప్రపంచవ్యాప్తంగా రూ.7,100 కోట్ల వసూళ్లు.
Michael OTT: ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మిలియన్ డాలర్ల అనగా సుమారు రూ.7,100 కోట్ల కలెక్షన్లతో గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(Michael OTT) వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది.
Peddi: ఇదెక్కడి క్రేజ్ రా మామా.. అర్జున్ థియేటర్ లో రామ్ చరణ్ గుడి.. పూజలు చేస్తున్న మెగా ఫ్యాన్స్
ఈ చిత్రం జూన్ 9 నుంచి బుక్‌మైషో స్ట్రీమ్‌లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ఇతర ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సైతం ఈ సినిమా రెంటల్ ప్రాతిపదికన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ బయోపిక్‌లో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం విశేషం. మైఖేల్ బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ స్టెప్స్‌ను జాఫర్ అద్భుతంగా పండించారని ప్రశంసలు దక్కాయి. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం, థియేటర్లలో మిస్ అయిన భారతీయ సంగీత ప్రియులకు, మైఖేల్ అభిమానులకు ఇప్పుడు ఓటీటీలో ఒక అద్భుతమైన దృశ్యకావ్యం కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.
