Mekathoti Sucharitha Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో పెద్ద చిచ్చే రాజేసింది. మంత్రి పదవి ఆశించి దక్కని వారు ఆవేదనతో రగిలిపోతున్నారు.(Mekathoti Sucharitha Resign)

Mekathoti Sucharitha Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

Mekathoti Sucharitha Resign : ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో పెద్ద చిచ్చే రాజేసింది. మంత్రి పదవి ఆశించి దక్కని వారు ఆవేదనతో రగిలిపోతున్నారు. కొందరు బాహాటంగానే పార్టీ అధిష్టానంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మరికొందరు కన్నీటిపర్యంతం అయ్యారు. ఇంకొందరు ఏకంగా రాజీనామా బాట పట్టారు.

కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లెటర్ ను మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు. జగన్ మొదటి కేబినెట్ లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా పని చేశారు. రెండోసారి కూడా తనకు మినిస్టర్ పదవి వస్తుందని ఆమె ఆశించారు.(Mekathoti Sucharitha Resign)

Balineni : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై బాలినేని తీవ్ర అసంతృప్తి

అయితే ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమె మనస్తాపం చెందారు. తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దళిత సామాజికవర్గానికి చెందిన వారందరికి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు కల్పించిన సీఎం జగన్.. తన ఒక్కదాన్ని మాత్రం కేబినెట్ నుంచి తొలగించారనే బాధను ఆమె వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అందరినీ తీసివేస్తామని జగన్ చెప్పారని, అదే విధంగా పాత వాళ్లను అందరినీ తీసేసి ఉంటే ఏ బాధ ఉండేది కాదని, కొంతమందిని ఉంచి కొంతమందిని తీసేయడం బాధ పెట్టిందని మేకతోటి సుచరిత వర్గీయులు వాపోతున్నారు.

Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం

వైఎస్ కుటుంబానికి తాను విధేయురాలిగా ఉన్నానని, కష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉన్నానని, అనేక ఇబ్బందులకు గురైనా జగన్ ను వదల్లేదని సుచరిత చెబుతున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మహిళగా తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆమె రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.(Mekathoti Sucharitha Resign)

AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్.. జిల్లాల వారీగా అవకాశం

తానేటి వనిత, నారాయణ స్వామి, పినిపె విశ్వరూప్, ఆదిమూలపు సూరేశ్.. ఇలా తనతో ఉన్న అందరూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తనను ఎందుకు కొనసాగించలేదనే బాధ ఆమెను తీవ్రంగా వేధిస్తోంది. ఆ బాధ, కోపం, అసంతృప్తిలోనే ఆమె రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారనేది తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం రెండు మూడు రోజుల్లో సమసిపోయే అవకాశం ఉందని, సుచరిత తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి తన అసంతృప్తి తెలవాలనే కోణంలోనే ఆమె రాజీనామా చేశారని అర్థమవుతోంది. తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కి కాకుండా పార్టీకి పంపించారు అంటే, తన అసంతృప్తిని తెలుపుకోవడానికే ఇలా చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.(Mekathoti Sucharitha Resign)

ఉత్కంఠకు తెరపడింది. కొత్త కేబినెట్ రూపుదిద్దకుంది. మూడు రోజులుగా మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు చేసిన సీఎం జగన్‌.. ఆదివారం తుది జాబితాను ఖరారు చేశారు. 25 మందితో ఏపీ నూతన మంత్రివర్గం సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మంత్రి వర్గం జాబితా
* శ్రీకాకుళం
ధర్మన ప్రసాద రావు (వెలమ)
సీదిరి అప్పలరాజు (మత్యకార)

* విజయనగరం
బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)

* పార్వతీపురం
రాజన్న దొర (ఎస్టీ)(Mekathoti Sucharitha Resign)

* అనకాపల్లి
గుడివాడ అమర్నాథ్ (కాపు)
ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)

* కాకినాడ జిల్లా
దాడిశెట్టి రాజా (కాపు)

* కోనసీమ జిల్లా
పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ)
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ – శెట్టి బలిజ)

* తూర్పుగోదావరి జిల్లా
తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)

* పశ్చిమ గోదావరి జిల్లా
కారుమూరి నాగేశ్వరరావు (యాదవ – బీసీ)
కొట్టు సత్యనారాయణ (కాపు)

* కృష్ణా జిల్లా
జోగి రమేష్ (గౌడ – బీసీ)

* పల్నాడు జిల్లా
అంబటి రాంబాబు (కాపు)

* బాపట్ల జిల్లా
మేరుగ నాగార్జున (ఎస్సీ)(Mekathoti Sucharitha Resign)

* గుంటూరు
విడదల రజని (బీసీ)

* ప్రకాశం జిల్లా
ఆదిమూలపు సురేశ్‌ (ఎస్సీ)

* నెల్లూరు జిల్లా
కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసీ – రెడ్డి)

* కడప జిల్లా
అంజద్‌ బాషా (మైనార్టీ)

* నంద్యాల జిల్లా
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసీ – రెడ్డి)

* కర్నూలు జిల్లా
గుమ్మనూరు జయరాం (బీసీ – బోయ)

* చిత్తూరు జిల్లా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ – రెడ్డి)
నారాయణ స్వామి (ఎస్సీ)
ఆర్కే రోజా (ఓసీ – రెడ్డి)

* అనంతపురం
ఉషా శ్రీ చరణ్‌ (కురుమ బీసీ)(Mekathoti Sucharitha Resign)