Balineni : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై బాలినేని తీవ్ర అసంతృప్తి

కొత్త కేబినెట్‌లో చోటు దక్కలేదన్న అసంతృప్తితో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఉదయం నుంచీ విజయవాడలో ఇంటికే పరిమితమయ్యారు.

Balineni : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై బాలినేని తీవ్ర అసంతృప్తి

Balineni (1)

Balineni Srinivasareddy : ఏపీలో మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రగిలిపోతున్నారు. సీఎం జగన్‌ పాత మంత్రుల్లో పది మందిని కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. అందులో తన పేరు కూడా ఉంటుందని బాలినేని ఆశించారు. కానీ, ఇప్పుడాయన పేరు లేదన్న క్లారిటీ రావడంతో తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.

కొత్త కేబినెట్‌లో చోటు దక్కలేదన్న అసంతృప్తితో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఉదయం నుంచీ విజయవాడలో ఇంటికే పరిమితమయ్యారు. కనీసం పార్టీ నాయకుల్ని, అనుచరుల్ని కూడా కలిసేందుకు బయటకు రాలేదు. బాలినేని ఆవేదనతో ఉన్నట్లు తెలుసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఇంటికి వెళ్లారు. కేబినెట్‌లో చోటు ఎందుకు ఇవ్వలేకపోయారో వివరించారు.

Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం

బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సజ్జల సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ బాలినేని కాంప్రమైజ్‌ కాలేదని తెలుస్తోంది. దీంతో సజ్జల అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మరోవైపు జగన్‌ కేబినెట్‌లో బాలినేనికి చోటు దక్కలేదన్న సమాచారంతో ఆయన నివాసానికి పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.

విజయవాడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అనుచరుల ఆందోళన చేపట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలినేనిని మంత్రివర్గంలో కొనసాగించాలని అనుచరులు నినాదాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం బాలినేని ఎంతో కృషి చేశారంటున్నారు. కొత్త కేబినెట్‌లోనూ ఆయనకు చోటివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.