Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం

ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది.

Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం

Jagan 2.03

Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదిమూలపు సురేశ్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఆఖరి నిమిషంలో ప్రకాశం జిల్లా నుంచి తెరపైకి ఆదిమూలపు సురేష్ పేరు వచ్చింది. ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది.

కానీ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి. మందుగానే ఆదిమూలపు సురేశ్ ను ప్రకటించివుంటే సమస్య ఉండేది కాదు. కానీ నూతన కేబినెట్ లిస్టులో తిప్పేస్వామని ప్రకటించి.. తిరిగి ఆయన స్థానంలో ఆదిమూలపు సురేశ్ ను ప్రకటించడం పట్ల తిప్పేస్వామి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో గమనించాల్సిన విషయం.

AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే

మొదటగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. చివరి వరకు ఆదిమూలపు సురేశ్ పేరు వినిపించినా.. ఆయన పేరు ప్రకటించలేదు. బాలినేని అలక, అసంతృప్తితో సమీకరణం మారింది. బాలినేనితో పాటు ఆదిమూలపు సురేశ్‌ను కూడా జగన్ పక్కన పెట్టారు. కేబినెట్ లో కొనసాగిస్తే ఇద్దరిని కొనసాగించాలి లేని పక్షంలో ఇద్దరిని కూడా తొలగించాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూవచ్చారు.

ఒకవేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి..తనను తీసేస్తే జిల్లాలో పరిస్థితులు దారుణంగా, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పారు. తాను కూడా పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదంటూ బాలినేని ముందు నుంచి కూడా చెప్పారు. ఈరోజు ఉదయం నుంచి ఆయన ఇదే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Governor : ఏపీ మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

ఆఖరి నిమిషంలో ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ పేరు తెరపైకి వచ్చింది. ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది. కొత్త కేబినెట్‌లో సామాజిక సమీకరణాలు మారాయి. రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్య, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు కొత్త కేబినెట్ చోటు దక్కలేదు.