AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్.. జిల్లాల వారీగా అవకాశం

25 మందితో జాబితా రిలీజ్ చేశారు. 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు.

AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్.. జిల్లాల వారీగా అవకాశం

Ap District

AP new cabinet : ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా విడుదల అయింది. 25 మందితో జాబితా రిలీజ్ చేశారు. 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు. బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పి. రాజన్నదొరకు చోటు దక్కింది. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, జొన్నలగడ్డ పద్మావతికు అవకాశం ఇచ్చారు.

జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా, ఉషశ్రీ, చరణ్, ఆదిమూలపు సురేష్, కామూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల్‌ లకు మంత్రి పదవులు దక్కాయి. జగన్‌ మంత్రివర్గంలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. రోజా, తానేటి వనిత, విడదల రజిని, ఉషాశ్రీ చరణ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్‌లో 14మంది కొత్త మంత్రులు.. 11మంది పాత మంత్రులు

జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుకు అవకాశం దక్కింది. విజయనగరం నుంచి బొత్స, రాజన్నదొరకు చోటిచ్చారు. విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు.. తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.

పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనతి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవి దక్కింది. చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా ఛాన్స్‌ కొట్టేశారు. కృష్ణా జిల్లా నుంచి జోగి రమేశ్‌కు మాత్రమే అవకాశమిచ్చారు. గుంటూరు జిల్లా నుంచి విడదల రజిని, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున పదవులు దక్కించుకున్నారు.

AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే

నెల్లూరు నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కడప నుంచి అంజాద్‌ బాషా ఒక్కరే కేబినెట్‌లో ఉండబోతున్నారు. ఇక కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాంకు ఛాన్స్‌ ఇచ్చారు. అనంతపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్‌, ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్‌ను మంత్రివర్గంలోకి సీఎం జగన్‌ తీసుకుంటున్నారు.