AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్‌లో 14మంది కొత్త మంత్రులు.. 11మంది పాత మంత్రులు
జగన్ కొత్త కేబినెట్‌లో 11మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం దక్కింది. మంత్రులంతా రేపు ఉదయం 11.31 నిమిషాలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Ap Cabinet (5)
AP new cabinet : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రుల జాబితా ఖరారైంది. మొత్తం 25మంది మంత్రులతో సీఎం జగన్మోహన్‌రెడ్డి కేబినెట్ రెడీ చేశారు. 14మంది కొత్త మంత్రులు.. 11మంది పాత మంత్రులతో మంత్రివర్గాన్ని రెడీ చేసుకున్నారు. ఈ మంత్రులంతా రేపు ఉదయం 11.31 నిమిషాలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
జగన్ కొత్త కేబినెట్‌లో 11మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం దక్కింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపె విశ్వరూప్, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, ఆదిమూలపు సురేశ్, తానేటి వనితకు మరోసారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం
జగన్ మంత్రివర్గంలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. రోజా, తానేటి వనిత, విడదల రజిని, ఉషాశ్రీ చరణ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే గతంలో లాగా ఈసారి కూడా మహిళకే హోంమంత్రి పదవి ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.