AP CM YS Jagan: విశాఖ రాజధానిపై గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ..

ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను జగన్ ఆహాన్వించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి మీ సహకారం అవసరమని కోరారు. ఈ క్రమంలో ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

AP CM YS Jagan: ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల  సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను జగన్ ఆహాన్వించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి మీ సహకారం అవసరమని కోరారు. ఈ క్రమంలో ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ పట్టణం ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని, నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నానని జగన్ అన్నారు. రాజధాని కాబోతున్న విశాఖకు అందరూ రావాలని, అందరూ అక్కడే పెట్టుబడులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లను కోరారు.

AP CM YS Jagan: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ పట్టణంను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కోర్టు తీర్పుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలకాలంలో త్వరలోనే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తామని, ఉగాది నుంచి అక్కడి నుంచి పాలన కొనసాగుతుందని మంత్రులు పేర్కొంటు వస్తున్నారు. అయితే, ఎన్నికల నాటికి ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ, సీఎం జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖకు త్వరలోనే రాజధాని మారుతుందని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.

AP CM Jagan: చెడు చేసే వారికి కూడా మంచి చేసే గుణం నాకుంది

ఇదిలా ఉంటే మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. విశాఖ నగరానికి వచ్చిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఉందని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా జగన్ వ్యాఖ్యలను బట్టిచూస్తే వచ్చే నెలాఖరు నాటికి విశాఖ పట్టణం రాజధానిని ఏపీకి స్విప్ట్ చేసే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయన్న చర్చ ఏపీలో జరుగుతుంది. మరోవైపు ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. గతంలో హైకోర్టులో అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, జనవరి 31న ఏపీ ప్రభుత్వం పిటీషన్ పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో నేడు సుప్రీంకోర్టులో ఈఅంశంపై ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు