Pawan Kalyan : ఏపీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..

Pawan Kalyan : ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు.

Pawan Kalyan : ఏపీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..

Pawan Kalyan

Updated On : December 10, 2025 / 1:22 PM IST

Pawan Kalyan : ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన ప్రకటన చేశారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో మాట మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.Al

Also Read: Chandrababu Naidu : ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గ్రామ శుభ్రతకు పనిచేసేవారిని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎలా..? సర్పంచ్ లకు ప్రధాన బాధ్యత గ్రామాలు శుభ్రంగా ఉంచడం. చాలా మంది సర్పంచ్ లు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది. సర్పంచ్ లు ఆ బాధ్యత నిర్వర్తించకపోయినా.. ఖాతరు చేయకపోయినా వారి అధికారం సెక్రటరీకి మార్చే ఆలోచన చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.

సోమిత్వ పథకం కేంద్రం సర్వే వద్దు అని ఎవరైనా ఎమ్మెల్యే చెప్తే మాకు తెలియజేయండి.. అలాంటి ఎమ్మెల్యేలతో మేము మాట్లాడతాం.. కచ్చితంగా సోమిత్వా పథకం సర్వే చెయ్యాలని పవన్ అన్నారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడంపై ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అది ప్రభుత్వ పాలసీ. రాబోయే క్యాబినెట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించి సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.