Seediri Appalaraju : చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు, మళ్లీ జగనే సీఎం- మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju : మహానాడులో ప్రవేశపెట్టిన మొదటి ఆరు హామీలకు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలుసా.? జగన్ మోహన్ రెడ్డి శకం ఏపీకి ఓ స్వర్ణయుగం.

Seediri Appalaraju – Chandrababu : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మేనిఫెస్టో వార్ నడుస్తోంది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మహానాడు సభలో చంద్రబాబు విడుదల చేసిన తొలి విడత టీడీపీ మేనిఫెస్టోని అధికార పార్టీ నేతలు టార్గెట్ చేశారు. అది మేనిఫెస్టో కాదు మాయ ఫెస్టో అని ఎద్దేవా చేస్తున్నారు. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చివరికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా చంద్రబాబు కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టారని విమర్శించారు.

Also Read..Seetharam Thammineni : బ్లాక్ కమాండోస్ లేకపోతే.. చంద్రబాబు ఫినిష్- స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ మేనిఫెస్టోపై స్పందించారు. ఈ నాలుగేళ్లలో సంక్షేమ పథకాల‌ గురించి అన్న మాటలకు ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి గత నాలుగేళ్లుగా రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వం సంక్షేమం అందిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం.. ప్రజలను సోమరపోతులు చేస్తుంది, అప్పులాంధ్ర, ఏపీని మరో శ్రీలంక, వెనిజులా చేస్తున్నామంటూ చంద్రబాబు అన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి సిగ్గుంటే ముందు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే మేనిఫెస్టో గురించి మాట్లాడాలని మంత్రి అన్నారు.

Also Read..TDP Leader Hariprasad : కొడాలి నానీ..కాపుల గురించి నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తాం

” మహానాడులో ప్రవేశపెట్టిన మొదటి ఆరు హామీలకు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలుసా.? ఈ కమ్యూనికేషన్ యుగంలో బాబు చేసిన వికృత చేష్టలు, నికృష్టపు మాటలు ప్రజలు మర్చిపోరు. ప్రభుత్వం అమ్మఒడి, చేయూత, ఇళ్లు ఇస్తే‌ చంద్రబాబు దిగజారి మాట్లాడారు. సంక్షేమం ద్వారా నాణ్యమైన మానవ వనరులు సాధించేందుకు కృషి చేస్తున్నాం.

జగన్ మోహన్ రెడ్డి శకం ఏపీకి ఓ స్వర్ణయుగం. పోర్టులు, హార్బర్లు, నాడు-నేడు, రోడ్లు వంటి అభివృద్ది కార్యక్రమాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తాం. జగన్ మళ్లీ‌ అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు. అమ్మఒడి, రైతు భరోసా పేర్లు మారిస్తే సరిపోతుందా? చంద్రబాబు బుర్రలో ఏమీ లేదు. చంద్రబాబు విజనరీ కాదు.. విస్తరాకుల కట్ట” అని మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు.

ట్రెండింగ్ వార్తలు