Atchenaidu : వైసీపీ నేతలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇంటిని టార్గెట్ చేస్తే.. గ్రామ స్ధాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Atchenaidu
Atchenaidu angry YCP Leaders : వైసీపీ నేతలు రోజు రోజుకు హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పలసా కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గం అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను నిరంతరం ఎండగడుతున్నందుకే నియోజకవర్గంలో టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా అక్కడికి వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇంటిని టార్గెట్ చేస్తే.. గ్రామ స్ధాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ సైకో లక్షణాలను వాళ్ల కార్యకర్తలు అనుసరిస్తున్నారని, అందుకే ఈ దుర్మార్గాలు అని అన్నారు.
Samul Prasad : రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో రోజుకో మలుపు
అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, నాగరాజు, బెందాలం అశోక్, టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పుతో కూలడం ఖాయమన్నారు.