AP Politics : మరోసారి చంద్రబాబు, పవన్ భేటీలపై బీజేపీ సమాలోచనలు.. ఏపీలో పొత్తులపై కమలదళం స్టాండ్ ఏంటీ?!

మరోసారి చంద్రబాబు, పవన్ భేటీలపై బీజేపీ సమాలోచనలు.. ఏపీలో పొత్తులపై కమలదళం స్టాంట్ ఏంటీ?! జనసేనతో పొత్తు ఉంటుందా? జనసేన ,టీడీపీ, బీజేపీ కలిస్తే వైసీపీ ఖతమేనా? మరోసారి పవన్, చంద్రబాబు భేటీతో హీటెక్కిన ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?

AP Politics: మరోసారి పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశం కావటంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. వైసీపీ ప్రభుత్వం అవలంభించే విధానాలే మరోసారి పవన్, చంద్రబాబు భేటీలకు కారణంగా మారిందని చెప్పాల్సిందే. ఎందుకంటే గతంలో పవన్ జనవాణి కార్యక్రమానికి వైజాగ్ వెళ్లిన సందర్భంగా వైసీపీ నేతలు చేసిన హంగామాతో జనవాణిని నిర్వహించలేదు. పోలీసుల నిర్భంధంతో పవన్ అనుకున్న కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెనుతిరిగిన పరిస్థితి. జనసేన నేతలు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టింది.

వైజాగ్ లో జరిగిన పరిస్థితుల్ని..జనసేన విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండించిన చంద్రబాబు పవన్ ను కలిసారు. మద్దతు తెలిపారు. తాజాగా మారోసారి పవన్ హైదరాబాద్ లో ఆదివారం (జనవరి 8,2023)న పవన్ కల్యాన్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా చంద్రబాబును పోలీసులు అడ్డుకోవటం, వాహనాన్ని సీజ్ చేయటం, చంద్రబాబుని కుప్పం వదిలి వెళ్లిపోవాయని చెప్పటం చంద్రబాబు రోడ్డుమీదరనే బైఠాయించి ధర్నా చేయటం వంటి పరిణామాలతో పవన్ చంద్రబాబుకు మద్ధతు తెలపటానికి ఆయన నివసానికి వచ్చారు.

వీరిద్దరు మరోసారి భేటీ కావటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కటంతో పాటు జనసేన తాము కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే చంద్రబాబుతో తాము ఎట్టి పరిస్థితుల్లోనే కలిసేది లేదని పవన్ తోనే పొత్తు పెట్టుకుని పోటీలో దిగుతామని చెబుతోంది బీజేపీ. ఈ క్రమంతో చంద్రబాబుతో పవన్ స్వయంగా భేటీ కావటంతో బీజేపీ సమాలోచనలు నిర్వహిస్తోంది. వీరిద్ధరి సమావేశాలను నిశితంగా పరిశీలిస్తోంది బీజేపీ. చంద్రబాబు వద్దు పవనే ముద్దు అని బీజేపీ అంటుంటే వైసీపీ నియంతృత్వ..అరాచకాలను అంతమొందించాలంటే అన్ని పార్టీలు కలవాలని పవన్ అంటున్నారు.

Chandrababu Pawan Kalyan Meeting : టార్గెట్ వైసీపీ.. ఒక్కటైన టీడీపీ, జనసేన..! చంద్రబాబు, పవన్ ఏం చర్చించారంటే..

కానీ చంద్రబాబు (టీడీపీ)తో బీజేపీ కలవటానికి ఇష్టపడటంలేదు. ఏపీలో బీజేపీ పరిస్థితి గురించి ముఖ్యంగా ఓటు బ్యాంకు గురించి చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు. దీంతో జనసేనకు ఉన్న క్రేజ్ తోనే ఏపీలో నిలబడాలని బీజేపీ యోచన. అదే సమయంలో టీడీపీతో పొత్తువద్దంటోంది. కానీ పవన్ మాత్రం బీజేపీతో మైత్రి సంబంధాలు ఉన్నాయంటూనే మరోపక్క వైసీపీని రానున్న ఎన్నికల్లో ఓడించాలంటే అన్నీ పార్టీలు కలవాలంటున్నారు. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి జనసేన, టీడీపీలు.

ఇక వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ జనసేన,టీడీపీ కలిస్తాయో..జనసేనతోనే ఉండే ఏపీ బీజేపీ కూడా కలిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేననేలా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో అంటకాగుతు..కేంద్రాన్ని వ్యతిరేకించే ధైర్యం లేదు వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్ కు..దీనికి వ్యతిగత కారణాలు ( ఆర్థిక నేరాల కేసులు) ఉణ్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ జనసేన, టీడీపీ కలిసినా వైసీపీ పరిస్థితి దుస్థితే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ పదే పదే అంటున్నారు. ఈక్రమంలో టీడీపీ,జనసేన పొత్తులు (రెండు పార్టీలు క్లారిటీ ఇవ్వకపోయినా) దాదాపు ఖరారు అనేలా ఉన్నాయి. ఇక బీజేపీ పరిస్థితి అటు టీడీపీ కలిసేది లేదంటోంది. పవన్ మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి తాను దేనికైనా సిద్దమే నాకు పదవులు ముఖ్యంగా కాదు వైసీపీని ఓడించాలి..లేకుంటే ఏపీ అంధకారమే అంటున్నారు. అటు టీడీపీ ఉద్ధేశ్యం కూడా అదే వైసీపీని ఓడించాలి..మరి టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ, బిజేపీ మిత్ర పక్ష మంటున్న పవన్..జనసేనతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉన్న టీడీపీ..మరి ఏపీలో 2024 ఎన్నికల్లో పొత్తులు ఎవరు ఎవరితో పెట్టుకుంటారు? అనే విషయం మాత్రం టెన్షన్ నెలకొనేలా చేస్తోంది. జనసేనతో కలివకపోతే బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపదు. బీజేపీతో కయ్యం పెట్టుకోవటానికే కాదు కనీసం చిన్న విమర్శ చేసే ధైర్యం కూడా వైసీపీకి లేదు. కానీ వైసీపీతో ఏపీ బీజేపీ నేతలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Chandrababu Naidu: రాజకీయాల్లో పొత్తులు సహజం.. గతంలోనూ పొత్తులు పెట్టుకున్నాం: చంద్రబాబు

పవన్ ఏపీలో పర్యటించటానికి బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారు. రోడ్ మ్యాప్ ఇవ్వటంలేదని పవన్ అంటున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం రోడ్ మ్యాప్ ఇచ్చాం పవన్ అధిష్టానంతో మాట్లాడుకోవాలని అంటున్నారు. వైసీపీతో ఏపీ బీజేపీ నేతలకు సత్ససంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న క్రమంలో పవన్ ను వ్యతిరేకించరు..అలాగని సమర్థించను కూడా చేయటంలేదు ఏపీ బీజేపీ నేతలు. వైసీపీని ఓడించటానికి అన్ని పార్టీలు కలవాలనే పవన్ త్వరలోనే ఏపీ బీజేపీ నేతలతో కలిసి మాట్లాడతానంటున్నారు. కానీ పవన్ చెప్పినా టీడీపీతో కలిసేది లేదంటున్నారు బీజేపీ నేతలు. ఇటువంటి తరుణంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు విషయంలో మూడు ప్రధాన పార్టీలు మూడు దారులుగా ఉంటే మరోసారి ఏపీకి ముప్పు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లు పవన్‌తో పొత్తులో ఉన్న బీజేపీ స్టాండ్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనే చర్చ జరుగుతోంది. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే.. బీజేపీ వ్యూహం ఏంటి అనే డిస్కషన్ నడుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు