Chandrababu Naidu: రాజకీయాల్లో పొత్తులు సహజం.. గతంలోనూ పొత్తులు పెట్టుకున్నాం: చంద్రబాబు

రాజకీయాల్లో పొత్తులు సహజమని, గతంలోనూ పలు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ తన నివాసంలో జనసేన అధినేత చంద్రబాబు నాయుడితో చర్చించిన అనంతరం ఆయనతో కలిసి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. పొత్తులపై మాట్లాడడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. గతంలో తాము టీఆర్ఎస్ తోనూ పొత్తులు పెట్టుకున్నామని గుర్తు చేశారు.

Chandrababu Naidu: రాజకీయాల్లో పొత్తులు సహజం.. గతంలోనూ పొత్తులు పెట్టుకున్నాం: చంద్రబాబు

Chandrababu Naidu: రాజకీయాల్లో పొత్తులు సహజమని, గతంలోనూ పలు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ తన నివాసంలో జనసేన అధినేత చంద్రబాబు నాయుడితో చర్చించిన అనంతరం ఆయనతో కలిసి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. పొత్తులపై మాట్లాడడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు.

గతంలో తాము టీఆర్ఎస్ తోనూ పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విభేదించామని అన్నారు. రాజకీయాల్లో సమీకరణాలు ఎల్లప్పుడూ మారుతుంటాయని చెప్పారు. ఏ సమయంలో ఏం చేయాలన్న దానిపై రాజకీయ పార్టీలకు ప్రణాళికలు ఉంటాయని తెలిపారు.

ఇటీవల వైసీపీ మాపై ప్రవర్తించిన తీరు గురించి సంఘీభావం తెలిపిన పవన్ కల్యాణ్ కు అభినందనలు చెబుతున్నాని అన్నారు. ఏపీలో వైసీపీ నేతలు భయంకరమైన పరిస్థితులను తీసుకొస్తున్నారని చంద్రబాబు చెప్పారు. తాము పరామర్శకు పోతే 2వేల మందితో గొడవచేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిందని చెప్పారు.

ఏపీలో ఆంక్షలతో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని, కుట్ర రాజకీయాలను తిప్పికొడతామని అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం కోసం వెళ్తే వైసీపీ వాళ్లు రాళ్లు, కర్రలతో దాడులు చేశారని చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే తమ కార్యాలయంపై దాడులు చేశారని అన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయని చెప్పారు. ఏపీలో ఒక ఉన్మాదిని ఎదుర్కొంటున్నామని మండిపడ్డారు.

Pawan Kalyan: ఆ విషయంపైనే చంద్రబాబు, నేను చర్చించాం: పవన్ కల్యాణ్