Pawan Kalyan: ఆ విషయంపైనే చంద్రబాబు, నేను చర్చించాం: పవన్ కల్యాణ్

 ఏపీలో తీసుకువచ్చిన జీవో నంబరు 1కి అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను చర్చించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడితో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే.

Pawan Kalyan: ఆ విషయంపైనే చంద్రబాబు, నేను చర్చించాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఏపీలో తీసుకువచ్చిన జీవో నంబరు 1కి అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను చర్చించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడితో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ సమావేశం ముగిశాక చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని అన్నారు. అలాగే, వైసీపీని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చిస్తామని, త్వరలో బీజేపీతో కూడా చర్చిస్తానని చెప్పారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తమ బాధ్యత అని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షే పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని అన్నారు. ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చెప్పారు.

అంతేగాక, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు ఉండే హక్కులను కూడా వైసీపీ సర్కారు అణచివేస్తోందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకువచ్చి, ప్రతిపక్ష నేతలను ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు వారు తీసుకొచ్చిన నిబంధనలను వారే పాటించడం లేదని చెప్పారు.

ఏపీలో ఫ్లెక్సీల నిషేధం అని చెప్పారని, అయితే, సీఎం జగన్ జన్మదినం వేళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ మంత్రుల తీరు బాగోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. మంత్రులు అంబటి రాంబాబు, అమర్‌నాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

వైసీపీ పాచినోళ్ల నుంచి అటువంటి వ్యాఖ్యలే వస్తాయని విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ ఏపీకి రావడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా చేరికలు సహజమని చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసే విషయంపై వారు చర్చించారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.

PK on Rahul: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు..