వాట్సప్ సెక్యూర్‌గా ఉండాలంటే.. వెంటనే సెట్టింగ్స్ ఇలా మార్చేయండి

వాట్సప్ సెక్యూర్‌గా ఉండాలంటే.. వెంటనే సెట్టింగ్స్ ఇలా మార్చేయండి

WhatsApp security feature

WHATSAPP: రీసెంట్ గా కొన్ని వారాల నుంచి వాట్సప్ గురించే మాట్లాడుకుంటున్నారు జనమంతా. అందులో చాలా వరకూ నెగెటివ్ గానే వినిపిస్తున్నాయి వార్తలు. ప్రైవసీ పాలసీ గురించే వచ్చి పడింది అసలు చిక్కంతా. మే15వరకూ యూజర్లంతా లేటెస్ట్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయాల్సిందేనని చెప్పారు. అంతకంటే ముందు అది ఫిబ్రవరి 8వరకే అని చెప్పినా పొడిగించారు. అసలు డేటా సెక్యూరిటీ, ప్రైవసీ అనేవి భద్రంగా ఉంచుకోలేమా.. సెట్టింగ్స్ తో కూడా కుదరదా అంటే కుదురుతుంది.. ఇలా చేసి సేఫ్ గా ఉండండి.

డివైజ్ లింకింగ్ సెక్యూరిటీ అప్ డేట్
మీ ఫోన్ తో డెస్క్ టాప్ లేదా ల్యాప్ ట్యాప్ లో వాట్సప్ వెబ్ ను ఓపెన్ చేయాలంటే.. అడిషనల్ లేయర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రొటెక్షన్ పెంచింది. దీని కోసం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నేషన్ ఉంటే అయిపోయినట్లే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డివైజ్ లింక్ చేసుకోవచ్చు.

మెసేజెస్ మాయమవడం
ప్రపంచవ్యాప్తంగా మెసేజెస్ మాయమయ్యే ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సప్. ఈ ఫీచర్ ఆన్ లో ఉంచితే.. చాటింగ్ చేసిన ఏడు రోజులకే మొత్తం చాట్ డిలీట్ అయిపోతుంది. అవసరం అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకుని ఉంచుకోవచ్చు.

రెండు స్టెప్పుల వెరిఫికేషన్
వాట్సప్ యూజర్లు రెండు స్టెప్పుల వెరిఫికేషన్ కచ్చితంగా ఆన్ లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అడిషనల్ లేయర్ తో ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఆరు డిజిట్ల పిన్ నెంబర్ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ సెట్ చేసుకుని సేఫ్ గా ఉండండి. ఇలా చేయడం వల్ల ఫోన్ దొంగిలించినా.. సిమ్ దొంగిలించినా మీ వాట్సప్ ను వేరే వాళ్లు యాక్సెస్ చేయడానికి వీలుండదు. వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసి అకౌంట్ లోకి వెళ్లి టూ స్టెప్ వెరిఫికేషన్ లో ఎనేబుల్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే చాలు.

టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీతో లాక్
వాట్సప్ యూజర్లకు ఎక్స్ ట్రా లేయర్ యాడ్ చేసి సెక్యూరిటీ పెంచింది. టచ్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ ఐడీ పెట్టి మీ ఐ ఫోన్, యాండ్రాయిడ్ ఏదైనా వాట్సప్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు.

గ్రూప్ సెట్టింగ్స్ :
వాట్సప్ గ్రూపుల్లో ఎవరుపడితే వాళ్లు మనల్ని యాడ్ చేసేసుకోకుండా కంట్రోల్ చేయవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి ట్యాప్ అకౌంట్ ఆప్షన్ ఎంచుకుని ప్రైవసీలోకి వెళితే గ్రూప్స్ కనిపిస్తుంది. అందులో ఉన్న మూడు ఆప్షన్స్ లో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి. ప్రతిఒక్కరూ, కాంటాక్టస్ లో ఉన్నవారు, మన అకౌంట్లలో లేని వారు.

ప్రైవసీ ప్రొఫైల్
పర్సనల్ ప్రొఫైల్ ఎవరూ ముట్టుకోకుండా చూసుకోవచ్చు. చివరిగా చూసింది, ప్రొఫైల్ ఫొటో, మన గురించి, స్టేటస్ వంటి వాటిని సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు.

రెగ్యూలర్ అప్ డేట్
వాట్సప్ ను రెగ్యూలర్ అప్ డేట్ చేసుకోవడం వల్ల సెక్యూరిటీ ఫీచర్లు యాడ్ అయి పర్ ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది.