మోడీ గెటప్‌లో ఎద్దుల బండిపై తిరుగుతూ.. వినూత్న నిరసన

మోడీ గెటప్‌లో ఎద్దుల బండిపై తిరుగుతూ.. వినూత్న నిరసన

Pm Modi: ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గెటప్ తో ఎద్దుల బండి ఎక్కి ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ వీధుల్లో ప్రధానిలా అలంకరించుకుని తెల్లని గడ్డంతో శాలువా కప్పుకుని.. ఎద్దులబండిపై తిరిగాడు. అంతే కాకుండా పెట్రోల్ ధరలు పెరిగాయా.. తగ్గాయా అని అడుగుతూ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఒడిశాకు చెందిన కాంగ్రెస్ యాక్టివిస్ట్ భిన్నమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆరు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేసిన బంద్ తర్వాత ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ర్యాలీలో లౌడ్ స్పీకర్లు పెట్టి.. పీఎం మోడీ పాత స్పీచ్ లను వినిపించారు. తెల్లని గడ్డం, తెల్లని జుట్లుతో లౌడ్ స్పీకర్ తో పాటు లిప్ సింక్ చేస్తూ.. చేతులను అదే తరహాలో ఆడిస్తూ కనిపించాడు.

మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ నేతృత్వంలో రోడ్లన్నీ బ్లాక్ చేశారు. షాపులు, స్కూళ్లు, కాలేజీలు మూసేసి వాహనాలను రోడ్లకు అడ్డంగా పెట్టి బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ వర్కర్లు గాంధీగిరి అవలంభిస్తూ.. బంద్ జరుగుతున్న సమయంలో రోడ్లపైకి వచ్చిన ప్రైవేట్ వాహనదారులకు చాక్లెట్లు ఇస్తూ.. నిరసన తెలియజేశారు.

ఫిబ్రవరి 16వరకూ పెరుగుతూనే ఉన్న పెట్రోల్ ధరలకు ఇది ఎనిమిదో రోజు. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ధరలు పెంచడంపై ప్రశ్నిస్తూ.. ఆరోపణలు చేస్తున్నాయి.