Lakshmi Narayana : నన్ను చంపేందుకు కుట్ర..! వాళ్ల బాస్‌కు శిక్ష పడేలా చేశానని నాపై కక్ష- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో ఇటువంటి చేయడానికి చాలా సులభం. పబ్లిక్ లో ఉంటాం. సందుల్లో గొందుల్లో తిరుగుతుంటాం.

Lakshmi Narayana : నన్ను చంపేందుకు కుట్ర..! వాళ్ల బాస్‌కు శిక్ష పడేలా చేశానని నాపై కక్ష- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

Cbi Former Jd Lakshmi Narayana

Lakshmi Narayana : విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ప్రాణహాని ఉందన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్ కు శిక్ష పడేలా చేశానని తనపై కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. తన కుటుంబసభ్యులు భయపడ్డారని, వారి ఆందోళన మేరకు తాను సీపీకి ఫిర్యాదు చేశానని లక్ష్మీనారాయణ తెలిపారు.

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది అంటూ విశాఖ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారాయన. నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని సీపీని కోరారు లక్ష్మీనారాయణ.

”ఫిర్యాదు వెరిఫై చేసుకున్న తర్వాత ఇవాళ సీపీకి కంప్లైంట్ ఇచ్చాను. సాధారణంగా పోలీసు విభాగాల్లో అనేక సంవత్సరాలు పని చేశాము కాబట్టి వచ్చిన విషయాల్లో సత్య, అసత్యాలు ఎన్ని ఉన్నాయి.. అది కరెక్ట్ సమాచారం అవునా కాదా అని వెరిఫై చేసుకున్నాకే విచారణ జరుపుతాం. నేను సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, కేసులు విచారించినప్పుడు మా బాసులను కష్టపెట్టాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. మా బాసుకి రిటర్న్ గిఫ్ట్ గా నాకు హాని కలిగించి బాసుకి రిటర్న్ గిఫ్ట్ పంపిద్దాం. అందరూ రెడీగా ఉండండి అని ఆ వ్యక్తులు చెప్పారు.

ఈ విషయం నాకు తెలియగానే దాని గురించి నేను వెరిఫై చేశాను. ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. నామినేషన్ వేసిన వ్యక్తి నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడని కూడా చెప్పారు. ఇవన్నీ కలిపి సీపీకి ఫిర్యాదు చేశాను. అనుమానితుల పేర్లను కూడా నా ఫిర్యాదులో మెన్షన్ చేశాను. కానీ, వ్యక్తుల పేర్లు యూజ్ చేసుకుని లబ్ది పొందే వ్యక్తిని కాదు నేను. విషయం తెలియాలి. ఆ విషయం మీద విచారణ జరగాలి. ఎన్నికల సమయంలో ఇటువంటి చేయడానికి చాలా సులభం. పబ్లిక్ లో ఉంటాం. సందుల్లో గొందుల్లో తిరుగుతుంటాం. కాబట్టి ఎవరైనా ఏం చేయాడానికైనా ఆస్కారం ఉంది. ఇలాంటి ఆలోచన వచ్చే వ్యక్తులపై యాక్షన్ తీసుకోవాలని సీపీని కోరామని” లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Also Read : ఏపీ రాజధాని అదే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు- పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు