Japan to Hawaii Bottle message : సముద్రంలో 6వేల కి.మీటర్లు కొట్టుకొచ్చి 37ఏళ్లకు చేరిన బాటిల్ మెసేజ్..!!

మరో బాటిల్ సందేశం ఆసక్తికరంగా మారింది. 37 ఏళ్ల క్రితం జపాన్ సముద్రంలో బాటిల్ లో పెట్టి పంపించిన ఓ సందేశం 6,000 కిలోమీటర్లు కొట్టుకొచ్చి హవాయ్ తీరానికి చేరుకుంది.

10TV Telugu News

Japan to Hawaii Bottle message : టాలివుడ్ నాగార్జున నటించిన శివమణి సినిమా సముద్రంలో కొట్టుకు వచ్చిన ఓ బాటిల్..దాంట్లో ఉండే ఓ లెటర్ పై నడుస్తుంది. అది సినిమా. కానీ నిజంగానే అటువంటివి జరుగుతాయా? అంటే నిజమేననిపించే ఎన్నో బాటిల్ మెసేజ్ కు నిరూపించాయి. సముద్రంలో కొట్టుకొచ్చిన బాటిల్ మెసేజ్ లు ఎన్నో ఉన్నాయి. అటువంటిదాంట్లో ఒక బాటిల్ మెసేజ్ గురించి తెలుసుకుందాం. ఈ బాటిల్ మెసేజ్ జపాన్ లో మూడు దశాబ్దాల క్రితం 37 ఏళ్ల క్రితం జపాన్ సముద్రం నుంచి కొట్టుకొచ్చి హవాయ్ కు చేరుకుంది…! ఇటువంటి విషయాలు భలే ఆసక్తి ఉంటాయి కదూ..మరి ఈ బాటిల్ మెసేజ్ గురించి తెలుసుకుందామా..

జ‌పాన్‌కు చెందిన ఓ హైస్కూల్ విద్యార్థులు 37 ఏండ్ల క్రితం కాగితం మీద ఓ సందేశం రాసి..ఆ కాగితాన్ని సీసాలో పెట్టి దాంట్లోకి నీరు వెళ్లకుండా గట్టిగా మూత బిగించి దాన్ని స‌ముద్రంలోకి విసిరాయు. ఆ మెసేజ్ ఎవరి కోసం పంపిచారో గానీ అది 37 ఏళ్లు సముద్రంలో కొట్టుకొచ్చీ..కొట్టుకొచ్చీ..అలా 6,000 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి తాజాగా హ‌వాయ్‌ బీచ్‌కు చేరుకోటంతో అదికాస్తా హాట్ టాపిక్ గా మారింది.

Read more : Message in Wine Bottle: సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన వైన్ బాటిల్ లో సీక్రెట్ ఐడీ..

జపాన్ రాజధాని టోక్యోలోని తూర్పు ప్రాంతమైన చీబాలోని చోసీ హైస్కూల్‌కు సంబంధించిన న్యాచుర‌ల్ సైన్స్ క్ల‌బ్ స‌భ్యులు (వీరంతా విద్యార్థులే) 1984, 1985 ప్రాంతంలో స‌ముద్ర ప్ర‌వాహాల‌పై ప‌రిశోధ‌న కోసం మొత్తం 750 బాటిళ్ల‌ను సముద్రంలో విడిచిపెట్టారు. ఈ బాటిల్ ఎవ‌రికి దొరికినా త‌మ‌ను సంప్ర‌దించాలంటూ ఆ బాటిళ్ల‌లోని కాగితాల్లో ఇంగ్లిష్‌, జ‌ప‌నీస్‌, పోర్చుగీస్ భాష‌ల్లో (అంటే ఆయా బాటిల్స్ ఏఏ దేశాలకు వెళతాయో..ఎవరికి దొరుకుతాయో తెలీదు కాబట్టి) సందేశాలు రాసి పెట్టారు. అలా స‌ముద్రంలో వ‌దిలేసిన బాటిళ్లు ఫిలిప్పీన్స్‌, కెన‌డా, అల‌స్కా ప్రాంతాల‌కు కొట్టుకుపోయాయి.

ఆ త‌ర్వాత కొన్ని బాటిళ్లు కొంద‌రికి దొరికాయి. వాటిలోని సందేశాన్ని చ‌దివారు. అలా చదివిన వారు నిర్లక్ష్యం చేయకుండా తిరిగి ఆ సందేశాన్ని తిరిగి అప్పగించారు. అలా 2002లో చివ‌ర‌గా జ‌పాన్‌లోని వాయ‌వ్య ప్రాంత‌మైన క‌గోషిమాలో 50వ బాటిల్ దొరికింది.  ఈక్రమంలో 51వ బాటిల్ హవాయ్‌లోని ప్యారడైజ్ పార్క్‌లో సమీపంలో ఉన్నబీచ్‌లో ఫాదర్స్ డే సందర్భంగా బీచ్ కు వచ్చిన ఓ కుటుంబంలోని ఇద్దరు బాలికలకు ఈ బాటిల్ దొరికింది. మట్టిలో కూరుకుపోయి కనిపించటంతో దాన్ని ఆసక్తిగా తీసిన బాలికలు వారి తల్లిదండ్రులకు చూపించారు.దాన్ని మరికాస్త ఆసక్తిగా చూసిన వారు ‘మేము ఒక సీసాలో ఒక సందేశాన్ని కనుగొన్నాము’ అని ఎంతో ఎక్సైంట్మెంట్ గా తెలిపారు. దాన్నితెరచి చూస్తే అది జపాన్ నుంచి వచ్చిందని అర్థమైంది అని వారు తెలిపారు.

Read more : Snake in Liquor Bottle: మద్యం బాటిల్ లో పాముపిల్ల..చూడకుండా తాగేసిన మందుబాబు..!

ఆ బాటిల్ దొరికిన బాలిక మాట్లాడుతు..గత మంగళవారం (సెప్టెంబర్ 2021)ఆ బాటిల్ బురదలో ఇరుక్కుపోయి కనిపించింది. దాన్ని బయటకు తీసి దాన్ని మా నాన్నకు ఇచ్చాను అని తెలిపింది. దాంట్లో ఓ నోట్ ఉంది. అది పాత స్కూల్ టైప్‌రైటర్‌పై వ్రాసిన నోట్‌లో అన్ని పెద్ద అక్షరాలతో..ఓసియన్ కరెంట్ ఇన్వెస్టిగేషన్. చిబా ప్రిఫెక్చురల్ చోషి హై స్కూల్ నేచురల్ సైన్స్ క్లబ్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు నోట్ ఉన్నట్లుగా తెలిసిందని చెప్పింది. “ఈ సీసా 1984 జూలైలో జపాన్‌లోని చోషి తీరంలో సముద్రంలోకి విసిరివేయబడింది,” అని నోట్ చదవబడింది, “జులై” అనే పదం సిరాలో చేతితో వ్రాయబడింది. అని తెలిసిందని చెప్పింది. ఈ 51వ బాటిల్ విషయంపై..  చోసి అనే హైస్కూల్ వైస్ ప్రిన్సిప‌ల్ జున్ హ‌యాషీ మాట్లాడుతు..దాదాపు 37 ఏళ్ల త‌ర్వాత ఆ బాటిల్ మెసేజ్ దొర‌క‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందని..ఇది చాలా ఎక్సైట్మెంట్ గా ఉందని తెలిపారు.

19 ఏండ్ల క్రితం 50వ బాటిల్ దొరికిన‌ప్పుడే ఇక మిగ‌తా బాటిళ్ల‌న్నీ ధ్వంస‌మై ఉంటాయ‌నుకున్నాన‌ని..కానీ మ‌రో బాటిల్ దొరుకుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని లేద‌ని హ‌యాషీ చెప్పారు. బాటిళ్ల‌న్నీ ధ్వంస‌మై నీళ్ల‌లో మునిగిపోయి ఉంటాయ‌ని అనుకున్నామనీ..తెలిపారు. ఇటువంటిసమయంలో ఇంకాస్త సమయం గడిచినా.. 52వ బాటిల్ కూడా దొరుకుతుందనిపిస్తుంద‌ని తెలిపారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చోసీ స్కూల్లోని న్యాచుర‌ల్ సైన్స్ క్ల‌బ్‌ను 2007లో మూసివేశార‌ట‌. కానీ వారు అప్పట్లో వదిలిన సందేశాలు మాత్ర ఒక్కొక్కటిగా లభ్యమవుతునే ఉంది. మరి మిగతా సందేశాలు కూడా దొరుకుతాయేమో చూడాలి. ఏది ఏమైనా ఇటువంటి బాటిల్ సందేశాలు మాత్రం భలే గమ్మత్తుగా ఉంటాయి. దశాబ్దాలు గడిచినా ఎక్కడోక చోట ఎవరోకరికి ఇటువంటివి దొరికి అలనాటి సంగతుల్ని జ్ఞాపకం చేస్తుంటాయి.