China : చైనాలో మరో వైరస్‌..ప్రపంచంలోనే మొదటి కేసు నమోదు..చికిత్స పొందుతున్న 4 ఏళ్ల బాలుడు

చైనాలో మరో వైరస్‌ వెలుగులోకి వచ్చింది.4 ఏళ్ల బాలుడికి సోకిన ఈ వైరస్ కేసు ప్రపంచంలోనే మొదటి కేసుగా నమోదు అయ్యింది.

China : చైనాలో మరో వైరస్‌..ప్రపంచంలోనే మొదటి కేసు నమోదు..చికిత్స పొందుతున్న 4 ఏళ్ల బాలుడు

China Human Bird Flu H3n8

China Human Bird Flu H3N8: చైనా మరోసారి కోవిడ్ కేసులు భారీగా పెరిగి నానా పాట్లు పడుతుంటే పులిమీద పుట్రలాగా మరో వైరస్ వచ్చి పడింది. ఈ వైరస్ సోకిన ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు చైనాలో నమోదు అయ్యింది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్‌ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగులోకి వచ్చింది. గుడ్డిలో మెల్లలాగా ఈ వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఈ వైరస్ ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని చైనా ఆరోగ్యశాఖా అధికారులు చెబుతున్నారు.

Also read : China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు

సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న 4 ఏళ్ల బాలుడికి జ్వరంతో పాటు ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. పిల్లాడు ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లతో పాటు ఇతర పక్షులు కూడా ఉన్నాయని అధికారుల విచారణలో తేలింది. వాటివల్లే H3N8 వేరియంట్‌ అతనికి సోకిందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

Also read : Mystery Disease‌ : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు

కానీ బాధితునితో పాటు అదే ఇంట్లో నివసిస్తున్న మిగిలినివారికి ఆ వైరస్‌ సోకలేదని స్పష్టం చేశారు. దీంతో..చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

Also read :  China Coronavirus: వణుకుతున్న చైనా.. ఒకేరోజు 56మంది మృతి..

మొదటిసారిగా 2002లో H3N8 వైరస్‌ ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్‌ కేవలం గుర్రాలు, కుక్కలు, సీల్స్‌కు మాత్రమే సోకుతుందని వైద్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కాగా చైనాలో ఈ వైరస్ మనుషులకు కూడా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.