Mystery Disease‌ : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు

అంతు చిక్కని వ్యాధితో చిన్నారులు కుప్పకూలిపోతున్నారు.కాలేయం వాపుతో నానా అవస్థలు పడుతున్నారు. అమెరికా, యూకే సమా ఐదు దేశాల్లో ఇటువంటి వింత కేసులు 100 నమోదు అయ్యాయి.

Mystery Disease‌ : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు

Us, Europe Scientists Probe Mysterious Liver Illness In Children

Mystery Disease‌ in US and UK : కరోనా మహమ్మారితో పోరాటం చేస్తునే మరోపక్క అంతబట్టని మిస్టరీ వ్యాధి ఏంటో తెలియక హడలిపోతున్నారు అమెరికా, బ్రిటన్‌లో వాసులు. చిన్నారులు ఉన్నట్లుండి కుప్పకూలిపోతుంటే తల్లిదండ్రులు గుండెలు ఆవేదనతో నిండిపోతున్నాయి. వచ్చిన జబ్బేమిటో డాక్టర్లు చెప్పక అసలు డాక్టర్లకే అంతబట్టని వింత వ్యాధితో చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. అమెరికా, బ్రిటన్ లతో పాటు మరో మూడు దేశాల్లో అంతబట్టని వ్యాధితో కాలేయం వాపుతో చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. ఐదు దేశాల్లో 100 కేసులు ఇటువంటి మిస్టరీ వ్యాధినపడిని చిన్నారులున్నారు. ఈ మిస్టరీ వ్యాధి గురించి సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సమస్థే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాధి ఏమిటి అనేది ఇప్పుడే చెప్పలేం అంటోంది డబ్ల్యూహెచ్‌వో.

also read : Corona 4th wave: కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన చిన్నారుల్లో సహసంబంధ వ్యాధులు

2021 అక్టోబర్‌లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1 నుంచి 6 ఏళ్లు. బాధిత చిన్నారులను పరీక్షించిన నిపుణులు వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతింది అని తెలిపారు. 3 నెలల తర్వాత యూకేలోని ప్రధాన నగరాల్లో 74 మంది పిల్లలకు మళ్లీ అటువంటి వ్యాధికే గురి అయ్యారు. తాజాగా మరో 3 దేశాల్లో కూడా పదుల సంఖ్యలో ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మిస్టరీ వ్యాధికి గల కారణాలను తేల్చేపనిలో పడ్డారు నిపుణులు. పలు పరిశోధనలు జరుపుతున్నారు. బాధిత చిన్నారులను రక్షించడానికి ప్రస్తుతం కాలేయమార్పిడి చికిత్సలు చేయాల్సి వస్తోంది.ప్రస్తుత పరిస్థితులను బట్టి కాలేయ మార్పిడి తప్పించి ఈ వింత వ్యాధి సమస్యకు పరిష్కారం లేదంటున్నారు.

బాధిత చిన్నారుల కాలేయంలో అనూహ్యంగా వాపు రావడంతో హెపటైటిస్‌ వైరస్‌లు (ఏ,బీ,సీ,డీ,ఈ) ఈ వ్యాధికి కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదట్లో భావించింది. పరిశోధనల్లో ఇది నిర్ధారణ కాలేదు. జలుబు, జ్వరాన్ని కలిగించే ఎడినోవైరస్‌, కొవిడ్‌-19కు కారణమయ్యే సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ చిన్నారుల శరీరంలో ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. చిన్నారుల్లో హెపటైటిస్‌, ఎడినోవైరస్‌ 41ను గుర్తించినట్టు అలబామా వైద్య విభాగం తెలిపింది. ఈ వ్యాధి ఏమిటన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో నిపుణులు కూడా చెబుతున్నారు.

also read : China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు

అంతుచిక్కని కాలేయ వ్యాధి అమెరికా, యూకేలోని చిన్నారులను భయపెడుతోంది.వ్యాధి సోకిన గంటల వ్యవధిలోనే పిల్లలు కుప్పకూలిపోతున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు తాత్కాలికంగా చికిత్స అందిస్తున్నా..ఈ వ్యాధి ఏమిటో మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీని వెనకున్న కారణాలపై ఒక కచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు.

ఈ వింత వ్యాధి అమెరికా, యూకే, స్పెయిన్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ లో వెలుగు చూసింది. ఈ వింత వ్యాధి లక్షణాలు..దురద, కండ్లు, చర్మం పసుపు పచ్చగా మారడం, విపరీతమైన జ్వరం, శ్వాసలో ఇబ్బంది, కీళ్లు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, మూత్రం పచ్చగా, మలం బూడిద రంగులో మారటం జరుగుతోంది.

also read : China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్‌..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..

వ్యాపిస్తున్న మిస్టరీ వ్యాధి..
రోగులు తాకిన ప్రదేశాలను తాకి.. అదే చేతులతో కండ్లు, ముక్కు, నోటిని తాకడం, తుమ్ము, దగ్గడం ద్వారా..ఈ వ్యాధి వ్యాపిస్తోంది అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు.