China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు

మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.

China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు

China covid  : ఆకలి కేకలు.. తట్టుకోలేక ఆత్మహత్యలు.. ప్రేమగా పెంచుకునే జంతువులను చంపేసి ఆకలి తీర్చుకుంటున్న తీరు.. ఉల్లాస నగరంలో శ్మశానంలా కనిపిస్తున్న వైనం.. చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘైలో పరిస్థితులు ఇవీ! కరోనా కారణంగా నగరం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దాదాపు రెండున్నర కోట్లమందిపై ఈ ప్రభావం పడింది. ఇంట్లో సరుకులు లేక.. బయట దొరకక.. అధికారులు జాడ లేక.. జనాలు పడుతున్న ఇబ్బందులు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాయ్. తినడానికి తిండి లేదు.. ఆకలితో అల్లాడిపోతున్నారు జనం.. పెద్దల నుంచి పిల్లన్ని దూరం చేస్తున్న పరిస్థితి. భఆర్యాభర్తలు కలిస్తే చంపేస్తామంటున్నారు.. పెంపుడు జంతువులను చంపి తింటున్న అత్యంత దయనీయ స్థితి. ఉల్లాస నగరంలో శ్మశాన నిశబ్దం తాండవిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌తో చైనా షాంఘైలో భయం భయంగా బతుకులు ఈడుస్తున్నారు.

Also read : India-Bangladesh: చాక్లెట్ కోసం నదిని ఈదుకుంటూ భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ బాలుడు

కరోనా నుంచి ఇప్పుడిప్పుడు ప్రపంచం కోలుకుంటోంది. అంతా నార్మల్ అవుతోంది. ఐతే కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో.. మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. కోవిడ్‌ పేరు చెప్తేనే చైనా వణికిపోతోంది. డ్రాగన్ కంట్రీ ఆర్థిక రాజధాని అయిన షాంఘైతో పాటు ఏడు నగరాలు.. మహమ్మారి ధాటికి అల్లాడిపోతున్నాయ్. వైరస్ దెబ్బకు మళ్లీ లాక్‌డౌన్ విధించారు. అర్థం లేని నిబంధనలు.. ఆకలి తీర్చలేని అసమర్థత.. అనాలోచిత విధానాలతో.. లాక్‌డౌన్ ప్రాంతాల్లోని జనాలు అల్లాడిపోతున్నారు. ప్రతీరోజూ కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని.. పిల్లలకు పెద్దలు దూరంగా ఉండాలని.. భార్యభర్తలు ఒకేచోట పడుకోద్దని.. ఇలా దిక్కుమాలిన రూల్స్ అన్నీ తీసుకువచ్చి.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తోంది డ్రాగన్‌ సర్కార్. చైనా ఇంతే.. చైనాలో ఇంతే అని అక్కడి పరిస్థితులపై చర్చ జరుగుతోంది.

Also read : China Lockdown: చైనాను గడగడలాడిస్తున్న కరోనా.. ఆంక్షల చట్రంలో 87నగరాలు.. మూత పడుతున్న కంపెనీలు

క‌రోనా జీరో పాల‌సీలో భాగంగా చైనా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వ్యూహాలు ఆ దేశ ప్ర‌జ‌ల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీంతో షాంఘై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి షాంఘైలో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ క‌రోనా విజృంభించ‌డంతో అక్క‌డ ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌తం చేశారు. ఈ క్రమంలో కోవిడ్ పేషెంట్లు స‌రెండ‌ర్ కావాల‌ని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘ‌ర్ష‌ణ‌కు దారి తీశాయి. హ‌జ్మ‌త్ సూట్ దుస్తుల్లో ఓ వీధికి వ‌చ్చిన పోలీసులు.. అక్క‌డ ఉన్న నివాసితుల ఇండ్ల‌ను స‌రెండ‌ర్ చేయాల‌ని కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసుల్ని స్థానికులు అడ్డుకున్నారు. ఓ కాంపౌండ్‌లో ఉంటున్న 39 మందిని త‌ర‌లించేందుకు పోలీసులు రాగా.. ఆ స‌మ‌యంలో ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. వైర‌స్ సోకిన రోగుల్ని అపార్ట్‌మెంట్ల‌లో పెట్టేందుకు పోలీసులు ముంద‌స్తుగా కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ కాంపౌండ్‌ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నార‌ని ఓ వీడియోలో మ‌హిళ అరుస్తూ క‌నిపించింది. ఆంక్ష‌ల వ‌ల్ల‌ ఇప్ప‌టికే షాంఘైలో ఆహార కొర‌త ఏర్ప‌డింది. పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తిని క్వారెంటైన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. షాంఘైలో అమ‌ల‌వుతున్న ఆంక్ష‌ల ప‌ట్ల ప్ర‌జ‌లు ఆన్‌లైన్‌లో వీడియోలు పోస్టు చేస్తున్నారు. కానీ అక్క‌డి ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని తొల‌గిస్తూనే ఉన్న‌ది. కొన్ని వీడియోలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.

Also read : Tirupati Hospital : తిరుపతి ఆస్పత్రిలో మరణ మృదంగం..వారంలో తొమ్మిది శిశువులు మృతి

గత రెండేళ్లలో చైనాలో పలుమార్లు వైరస్ వ్యాపించింది. కేసులు పెరగడం తర్వాత తగ్గడం.. మళ్లీ పెరగడం రొటీన్‌గా మారింది. ఐతే ఈసారి వైరస్ మాత్రం చైనాకు చుక్కలు చూపిస్తోంది. షాంఘై నగరం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. కోవిడ్ వ్యాప్తి ఆ నగరంలోని దాదాపు రెండున్నర కోట్ల మందిని లాక్‌డౌన్‌లోకి నెట్టేసింది. కఠినమైన ఆంక్షలు లక్షలాది మందిని ఇళ్లకే పరిమితం చేశాయ్. నిత్యావసరాలు కూడా దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటంతో వారంతా అల్లాడిపోతున్నారు. ఇళ్లలో దాచుకున్న ఆహార పదార్థాలు అయిపోవడంతో… ఏం చేయాలో తెలియక ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రభుత్వం అయినా ఆదుకుంటుందా అంటే.. అదీ లేదు. జనాన్ని బయటకు రానివ్వదు.. ఇంటింటికీ ఆహారాన్ని అందించదు..

ఆకలి.. ఆకలి.. ఆకలి.. షాంఘైలో ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు కూడా దొరకక… జనాలు అల్లాడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇళ్లు కదిలే వీలులేదు.. ఇంట్లోనేమో సరుకులు నిండుకున్నాయ్.. ఎలాగోలా బయటకు వెళ్లినా సూపర్​మార్కెట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయ్. చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన మందులు కూడా దొరకట్లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై జనాలు మండిపడుతున్నారు. ఇండ్లనుంచి బయటికి వచ్చే వీలులేకపోవడంతో కిటికీల దగ్గర, బాల్కనీలో నిల్కొచని.. జిన్‌పింగ్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆవేదనతో పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నరు.

Also read : Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

ఏప్రిల్‌ ఒకటి నుంచి షాంఘైలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. నగరంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలి బాధలు తట్టుకోలేక జనాలు.. ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. చివరికి తాము ఇన్నాళ్లూ ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను, పక్షులను కూడా చంపుకు తినే పరిస్ధితికి వచ్చేశారు. ఇలా చేయకపోతే.. ఆకలితో తాము చావాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు ఇళ్లలో ఆహారంతో పాటు పెంపుడు జంతువులు కూడా మాయం అవుతున్నాయ్. షాంఘై జనాల ఇబ్బందులు.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తలుచుకోవడానికి భయంగా ఉందన్న ఆందోళన కనిపిస్తోంది.

Also read : Imran Khan: విదేశీయుల నుంచి విరాళాలు అడుగుతున్న ఇమ్రాన్ ఖాన్

ఆకలితో చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యం అని కొందరు…. జైలుకు వెళ్తే కనీసం తిండి దొరుకుతుందన్న ఆశతో అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరికొందరు.. ఇలా షాంఘైలో పరిస్థితులు కన్నీరు పెట్టిస్తున్నాయ్. షాంఘై అంటే ఉల్లాస నగరం అని పేరు. 97 శాతం అక్షరాస్యులు, అత్యంత సంపద, డిస్నీలాండ్‌తో ప్రముఖ నగరంగా పేరుగాంచిన షాంఘైలో ఆకలి కేకలు.. ఆకలి తట్టుకోలేక ఆత్మహత్యలు.. ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకోవడం ప్రపంచదేశాలను కదిలిస్తోంది. చైనా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయ్. జనాలకు అండగా ఉండాలని.. ప్రభుత్వ తీరు మారాల్సిన అవసరం ఉందని వివిధ దేశాల ప్రతినిధులు సూచిస్తున్నారు.