Imran Khan: విదేశీయుల నుంచి విరాళాలు అడుగుతున్న ఇమ్రాన్ ఖాన్

ఇటీవలే పదవి పోగొట్టుకుని మాజీ అయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కొత్త ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI)ను అధికారంలోకి తెచ్చుకునేందుకు..

Imran Khan: విదేశీయుల నుంచి విరాళాలు అడుగుతున్న ఇమ్రాన్ ఖాన్

Imran Khan

Imran Khan: ఇటీవలే పదవి పోగొట్టుకుని మాజీ అయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కొత్త ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI)ను అధికారంలోకి తెచ్చుకునేందుకు విదేశాల్లో సెటిల్ అయిన పాకిస్తానీల నుంచి విరాళాలు కోరుతున్నారు. పాకిస్తాన్ లో అధికారంలో ఉన్న తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు.

namanzoor.com అనే వెబ్‌సైట్‌లో విరాళాలు ఇవ్వాలని కోరుతూనే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంను మరో సారి ఎన్నికలు పిలుస్తానని చెప్పారు. పాకిస్తానీలు.. తమ దేశాన్ని ఎవరు పాలించాలో తెలుసుకోవాలని సూచించారు. హఖీఖీ ఆజాదీ కాంపైన్ నిర్వహించి అవినీతి ప్రభుత్వం 22కోట్ల మంది పాకిస్తాన్ జనాభాను పరిపాలిస్తుందంటూ వ్యాఖ్యానించారు.

ప్రజలు తమను ఎవరు పాలించాలో ఎంచుకునే హక్కు ఉంది. పీటీఐ పార్టీయా లేదంటే.. కరప్ట్ అయిన షరీఫ్ ఫ్యామిలీనా అని ప్రశ్నించారు. దాంతో పాటుగా షరీఫ్ ఫ్యామిలీ కరప్షన్ ఆరోపణలతో మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిందని గుర్తు చేశారు. “విదేశీ కుట్ర” ద్వారా పాకిస్తాన్ ప్రజలపై షెహబాజ్ షరీఫ్‌తో కలిసి అమెరికా కుట్ర పన్నుతున్నదని పాకిస్తాన్ మాజీ ప్రధాని నిందించారు.

Read Also: పాకిస్తాన్ బాటలోనే కువైట్: రాజకీయ అస్థిరత కారణంగా ప్రధాని సహా మంత్రులు రాజీనామా

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై తీర్మానం అమెరికాలో జరిగిన “విదేశీ కుట్ర”లో భాగమని ఆరోపిస్తూ, పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుండి వచ్చిన “బెదిరింపు లేఖ”ను చూపించారు.