Kuwait Government: పాకిస్తాన్ బాటలోనే కువైట్: రాజకీయ అస్థిరత కారణంగా ప్రధాని సహా మంత్రులు రాజీనామా

అరబ్ దేశం కువైట్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అయింది. ఈక్రమంలో ప్రధాని సహా కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి వైదొలగుతూ కువైట్ రాజుకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు

Kuwait Government: పాకిస్తాన్ బాటలోనే కువైట్: రాజకీయ అస్థిరత కారణంగా ప్రధాని సహా మంత్రులు రాజీనామా

Kuwait

Kuwait Government: అరబ్ దేశం కువైట్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అయింది. ఈక్రమంలో ప్రధాని సహా కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి వైదొలగుతూ కువైట్ రాజుకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. దేశంలో క్లిష్టమైన ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలకు అవరోధం కలిగించేలా రాజకీయ సంక్షోభం మరింత దిగజారిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా..ఆదేశ యువరాజుకు అందించిన లేఖలో పేర్కొన్నారు. కాగా మధ్య ఆసియాలో ఇటీవల పాకిస్తాన్ సహా కొన్ని దేశాలు తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కువైట్ లో ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాదిన్నర కాలంలో ఇలా మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేయడం ఇది మూడోసారి.

Also read:Russia Ukraine War: వాళ్లు సైనికులు కాదు.. ఉగ్రవాదులే..!

డిసెంబరు నాటికి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేలా ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ప్రస్తుత అధికార పార్టీ కొత్త మంత్రులను నియమించింది. అయితే కొత్త మంత్రులు వచ్చినా దేశంలో కొత్త సంస్కరణలను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవడంతో ఇలా రాజీనామాల పర్వం మొదలైంది. ప్రధానిగా షేక్ సబాపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అతని పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చట్టసభ సభ్యులు ప్రధానిపై వచ్చిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ప్రధానిగా షేక్ సబా “పనికిరాడు” అంటూ బహిరంగంగా ప్రకటించారు.

Also read:World Health Day 2022 : మనం పీల్చే గాలి మంచిదేనా? ప్రపంచ జనాభా 99శాతం కలుషితమైన గాలినే పీలుస్తోంది.. WHO కొత్త డేటా!

ప్రస్తుతం కువైట్ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అత్యవసరమైన సంస్కరణలను రూపొందించడంలో కొత్త ప్రధాని ఆవశ్యక్త ఎంతైనా ఉందంటూ చట్ట సభ్యులు పిలుపునిచ్చారు. ఆయిల్ నిల్వలు విరివిగా ఉన్న కువైట్ దేశంలో..జీడీపీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ముడిచమురు ఎగుమతులపైనే అధికంగా ఆధారపడిన ప్రభుత్వం..దేశంలో సంస్కరణలు తెచ్చి ఇతర వ్యాపారాలను ప్రోత్సహించడంలో విఫలమైంది. పర్షియా రాజుల నిరంకుశ రాజ్య పాలనలో కొనసాగుతూ వచ్చిన కువైట్ లో పార్లమెంట్ వ్యవస్థ రూపుదిద్దుకోని చట్టాలను ఆమోదించడం మరియు నిరోధించడం, మంత్రులను ప్రశ్నించడం మరియు సీనియర్ అధికారులపై అవిశ్వాస తీర్మానాలు వంటి ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకి వచ్చాయి.

Also read:Fuel Prices Today : ఆగని పెట్రో బాదుడు.. 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు