World Health Day 2022 : మనం పీల్చే గాలి మంచిదేనా? ప్రపంచ జనాభా 99శాతం కలుషితమైన గాలినే పీలుస్తోంది.. WHO కొత్త డేటా!

World Health Day 2022 : పర్యావరణం ఆరోగ్యంగా ఉంచినప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. పర్యావరణాన్ని ఎప్పుడూ కలుషితం అవుతుందో మనకు అదే కలుషితమై తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది.

World Health Day 2022 : మనం పీల్చే గాలి మంచిదేనా? ప్రపంచ జనాభా 99శాతం కలుషితమైన గాలినే పీలుస్తోంది.. WHO కొత్త డేటా!

World Health Day 2022 : పర్యావరణం ఆరోగ్యంగా ఉంచినప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. పర్యావరణాన్ని ఎప్పుడూ కలుషితం అవుతుందో మనకు అదే కలుషితమై తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులతో పెను విపత్తలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు వాతావరణ విశ్లేషకులు. అయితే మనం పీల్చే గాలి ఎంతవరకు నాణ్యమైనదో ఎప్పుడైనా గమనించారా? వాస్తవానికి మనం పీల్చే గాలిలో నాణ్యత చాలా తక్కువ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). ఎందుకంటే.. దాదాపు ప్రపంచ మొత్తం జనాభా (99 శాతం) కలుషితమైన గాలినే పీలుస్తోందని WHO ఒక ప్రకటనలో వెల్లడించింది. కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్యానికి చాలా ముప్పు కలుగుతుందని WHO ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

రానురాను పర్యావరణం కలుషితం కావడంతో 117 దేశాలలో రికార్డు స్థాయిలో 6వేల నగరాలు గాలి నాణ్యతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఆయా నగరాల్లో నివసించే ప్రజలు ఇప్పటికీ అనారోగ్యకరమైన సూక్ష్మకణాలు, నైట్రోజన్ డయాక్సైడ్‌ను పీల్చి బతుకుతున్నారని తేలింది. చిన్న మధ్య-ఆదాయ దేశాలలోని ప్రజలు అత్యధిక ఈ నాణ్యత లేని గాలినే ఎక్కువగా పీల్చుకుంటున్నారని కొత్త WHO డేటా వెల్లడించింది. శిలాజ ఇంధన వినియోగాన్ని అరికట్టడంతో పాటు వాయు కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేస్తోంది.

ఈ ఏడాది.. ‘మన గ్రహం-మన ఆరోగ్యం’ థీమ్ 
2022 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day, 2022) సందర్భంగా ఈ ఏడాదిలో ‘మన గ్రహం-మన ఆరోగ్యం’ (Our Planet, Our Health) అనే థీమ్‌తో ముందుకు వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నాణ్యత డేటాబేస్ 2022 అప్‌డేట్ మొదటిసారిగా విడుదల చేసింది. ఇందులో నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) సాంద్రతతో ప్రధానంగా నగరాల్లో కాలుష్యానికి కారణమవుతోంది. 10 మీ (PM10) లేదా 2.5 m (PM2.5) కన్నా సమానమైనదిగా ఉంటుంది. కాలుష్య కారకాల్లో ప్రధానంగా శిలాజ ఇంధన దహనానికి సంబంధించిన మానవ కార్యకలాపాల నుంచి ఉద్భవించాయి. గతంలో కన్నా దాదాపు 2వేల నగరాలు ఇప్పుడు పర్టిక్యులేట్ మ్యాటర్, PM10 /లేదా PM2.5 కోసం గ్రౌండ్ మానిటరింగ్ డేటాను రికార్డ్ చేస్తున్నాయి. 2011లోనే ఈ డేటాబేస్ ప్రారంభం కాగా.. దాదాపు 6 రెట్లు పెరుగుదలను సూచిస్తోంది.

మన ఆరోగ్యంపై వాయు కాలుష్యం ప్రభావం :
వాయు కాలుష్యం మానవ శరీరానికి చేసే నష్టానికి సంబంధించిన ఆధారాలు చాలానే ఉన్నాయి. తక్కువ స్థాయి వాయు కాలుష్య కారకాల వల్ల కూడా మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పర్టిక్యులేట్ (PM2.5) అనే పదార్థం.. మన ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశించగలదు. దీని కారణంగా హృదయనాళ, సెరెబ్రోవాస్కులర్ (స్ట్రోక్), శ్వాసకోశ ప్రభావాలకు కారణమవుతుంది. అంతేకాదు.. ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని, ఫలితంగా అనేక వ్యాధులకు కారణమవుతుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. NO2 అనేది శ్వాసకోశ వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఆస్తమా, శ్వాసకోశ లక్షణాలకు దారితీస్తుంది (దగ్గు, గురక లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) ఆసుపత్రిలో చేరడం వంటి ఎమర్జెన్సీ పరిస్థితులకు దారితీస్తుంది. గత ఏడాదిలో WHO ఎయిర్ క్వాలిటీ మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల్లో గాలి నాణ్యతను అంచనా వేసేందుకు ఎయిర్ క్వాలిటీ నియంత్రణపై మరింత కఠినతరం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకుంటున్నాయి. అయితే WHO ఈ చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వాలను కోరుతోంది.

World Health Day 2022 New Who Data Shows 99 Per Cent Of World’s Population Breathes Unhealthy Air (1)

World Health Day 2022 New Who Data Shows 99 Per Cent Of World’s Population Breathes Unhealthy Air

– WHO, వాయు నాణ్యత మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ గాలి నాణ్యత ప్రమాణాలను సవరించాలి
– గాలి నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు వాయు కాలుష్య మూలాలను గుర్తించండి.
– సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థకు మారాలి. పాదచారులకు, సైకిలింగ్ నెట్‌వర్క్‌లను వినియోగించాలి.
– కఠినమైన వాహన ఉద్గారాలతో జాగ్రత్తగా ఉండాలి. కాలుష్య కారకాలను నియంత్రించాలి.
– గృహ విద్యుత్ ఉత్పత్తిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టండి.
– పరిశ్రమ, మునిసిపల్ వ్యర్థాల నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి.
– వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, అడవిలో మంటలు, వ్యవసాయ-అటవీ కార్యకలాపాలను తగ్గించడం చేయాలి
– పిల్లల పాఠ్యాంశాల్లో వాయు కాలుష్యాన్ని చేర్చండి. ఆరోగ్య రంగంలో మరిన్ని టూల్స్  అందించాలి.

117 దేశాల్లో గాలి నాణ్యత :
74 దేశాలలో సుమారు 4,000 నగరాలు గ్రౌండ్ లెవెల్‌లో NO2 డేటాను సేకరిస్తాయి. ఈ ప్రదేశాలలో కేవలం 23 శాతం మంది మాత్రమే NO2 వార్షిక సగటు సాంద్రతలను పీల్చుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. 2022 డేటాబేస్ ప్రకారం.. ప్రపంచంలోని గాలి నాణ్యత స్థితిని పర్యవేక్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం – 2022 :
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా మరణాలు పర్యావరణ కారణాల వల్లనే సంభవిస్తున్నాయని WHO అంచనా వేసింది.

Read Also : Covid Warns: కోవిడ్‌ వైరస్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది..కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ్..నిబంధనలు తప్పనిసరి ‌: WHO