Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కోరలుచాస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాలో ఇప్పటికే కొత్త వేరియంట్లతో కరోనా విజృంభిస్తుంది. ఫలితంగా ఆ దేశంలోని వంద ప్రధాన ...

Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

Carona Vairus

Coronavirus: ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కోరలుచాస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాలో ఇప్పటికే కొత్త వేరియంట్లతో కరోనా విజృంభిస్తుంది. ఫలితంగా ఆ దేశంలోని వంద ప్రధాన నగరాల్లో 87 నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. పక్క దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఉధృతి చూస్తుంటే మున్ముందు భారత్ లోనూ కొవిడ్ తీవ్రత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా అదుపులోనే ఉంది. రోజుకు వెయ్యిలోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీలో పెరుగుతున్న కొవిడ్ కేసులను బట్టి చూస్తుటే.. ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Covid-19 Guidelines : ఢిల్లీ NCRలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూళ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు..!

ఢిల్లీలో గురువారం 325 పాటిజివ్ కేసులు నమోదు కాగా పాజిటివిటీ రేటు 2.39గా ఉంది. శుక్రవారం 366 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు శాతం (3.95శాతం) పాజిటివిటీ రేటుకు పెరిగింది. మృతుల సంఖ్య లేకపోయినప్పటికీ పాజిటివ్ కేసుల పెరుగుదలతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏప్రిల్ 1న 0.57శాతంగా పాజిటివిటీ రేటు ఉండగా శుక్రవారానికి 3.95శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయం. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల వివరాలు గమనిస్తే.. ఏప్రిల్ 11న 137, ఏప్రిల్ 12 202, ఏప్రిల్ 13న 299, ఏప్రిల్ 14న 325, ఏప్రిల్ 15న 366గా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. గడిచిన వారం రోజుల్లో నోయిడాలో 44 మంది బడి పిల్లలు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.

Covid Xe Variant : కొత్త రూపంలో కరోనా..ఈ లక్షణాలను గుర్తించండి..అప్రమత్తమవ్వండి

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు చాలా మంది ముందుకు రావటం లేదని తెలుస్తుంది. వ్యాధి తీవ్రత ఉన్నవారు మాత్రమే టెస్టులకు ముందుకు వస్తున్నారు. దీన్ని బట్టి నగరంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉండొచ్చని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. అయితే వైరస్ ప్రభావంతో దవాఖానాలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ సూచించారు. మరోవైపు దేశ రాజధానిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఏప్రిల్ 20న ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.