India-Bangladesh: చాక్లెట్ కోసం నదిని ఈదుకుంటూ భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ బాలుడు

చాక్లెట్ తినటానికి ఓ బాలుడు దేశ సరిహద్దుని దాటాడు.బంగ్లాదేశ్ నుంచి ఓ నదిని ఈదుకుంటూ భారత్ వచ్చి..రిమాండ్ కు తరలించబడ్డాడు.

India-Bangladesh: చాక్లెట్ కోసం నదిని ఈదుకుంటూ భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ బాలుడు

Bharath Bangladesh

India-Bangladesh: చాక్లెట్ తినటానికి ఓ బాలుడు పెద్ద సాహజమే చేశాడు.ఏకంగా దేశ సరిహద్దుని దాటాడు. అంతేకాదు ఓ నదిని ఈదుకుంటూ వచ్చి మరీ దేశ సరిహద్దులు దాటి చిక్కుల్లో పడ్డాడు బంగ్లాదేశ్ కుర్రాడు. భారత్ లోకి ప్రవేశించి రిమాండ్ కు తరలించబడ్డాడు. చాక్లెట్ తినాలనే ఆశతో వచ్చి భారత జవాన్లుకు పట్టుబడ్డాడు.  అనుమతి లేకుండా దేశ సరిహద్దులు దాటినందుకు ఊచలు లెక్కిస్తున్నాడు పాపం..

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని శాల్డా నది సమీపంలోని బ్రాహ్మణబారియా పరిధిలోని ఖల్దానాడి గ్రామంలో నివసించే బాలుడు ఎమాన్ హొసైన్‌కు భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ చాక్లెట్ తినాలనే కోరిన కలిగినప్పుడల్లా శాల్దా నదిని ఈదుకుంటూ త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వచ్చి చాక్లెట్లు కొనుక్కుని మళ్లీ నదిని ఈదుకుంటూ వచ్చిన దారినే వెళ్తుండేవాడు. అలా ఏప్రిల్ 13న మరోసారి వచ్చి అదే మార్గంలో ఇంటికి తిరిగి వచ్చేవాడు.

Also read : Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

ప్రతీసారి వచ్చినట్లుగా ఎమాన్ హోసైన్ భారతదేశంలోని కలమ్‌చౌరా గ్రామంలోని ఒక దుకాణం నుండి చాక్లెట్ కొనడానికి ముళ్ల కంచెలోని రంధ్రం గుండా దొంగచాటుగా వచ్చినప్పుడు బీఎస్ఎఫ్ సిబ్బందికి దొరికిపోయాడు. వారు బాలుడిని స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. బాలుడు ఎందుకు భారత్ లోకి వచ్చాడో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. కానీ అలా అనుమతి లేకండా దేశ సరిహద్దు దాటి రావటం నేరం అని చెప్పిన అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.

భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే తనకెంతో ఇష్టమని, వాటిని కొనుక్కోవటానికి ఇలా నది దాటి వస్తుంటానని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అతడి వద్ద 100 బంగ్లాదేశీ టాకాలను గుర్తించారు. అతని వద్ద చట్టవిరుద్ధమైనవి మరేమీ లేవని తెలిపారు. కానీ అనుమతి పత్రాలు లేకుండా ఇలా దేశ సరిహద్దులు దాటి రావటం నేరం కాబట్టి బాలుడిని కోర్టులో ప్రవేశ పెట్టామని తెలిపారు. అయినా ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని, మరోమారు అతడిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, బాలుడి గురించి ఇప్పటి వరకు అతడి కుటుంబ సభ్యులు ఎవరూ భారత అధికారులను సంప్రదించలేదు.

Also read : Imran Khan: విదేశీయుల నుంచి విరాళాలు అడుగుతున్న ఇమ్రాన్ ఖాన్

కాగా..బంగ్లాదేశీయులు తరచుగా కిరాణా సామాను కొనడానికి..సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు భారత్‌లోకి చొరబడుతుంటారు. BSF సాధారణంగా మానవతా దృక్పథంతో వారిని పెద్దగా పట్టించుకోదు. కానీస్మగ్లర్లు..ట్రాఫికర్లపై చర్యలు తీసుకుంటుంది.