China Lockdown: చైనాను గడగడలాడిస్తున్న కరోనా.. ఆంక్షల చట్రంలో 87నగరాలు.. మూత పడుతున్న కంపెనీలు
డ్రాగన్ కంట్రీని కరోనా చిత్తుచేస్తుంది. కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గవేకాల్ డ్రొగొనామిక్స్ అధ్యయనం ప్రకారం.. చైనాలోని వంద ప్రధాన ...

Lock Down In China
China Lockdown: డ్రాగన్ కంట్రీని కరోనా చిత్తుచేస్తుంది. కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గవేకాల్ డ్రొగొనామిక్స్ అధ్యయనం ప్రకారం.. చైనాలోని వంద ప్రధాన నగరాల్లోని 87నగరాల్లో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. సుమారు 40కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా షాంఘై నగరంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నారు. మూడు వారాలుగా అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆహారం దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు షాంఘైలో కఠినమైన ఆంక్షలు అమలవుతుండటంతో పాటు కంపెనీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీంతో తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనని అక్కడి ప్రజలు ఆందోళణ చెందుతున్నారు.
China Lockdown: కొత్త వేరియంట్ లేదు అయినా చైనాలో లాక్ డౌన్? ఎందుకు?
అంతేకాక కొవిడ్ సోకినవారి సంఖ్య పెరుగుతుండటంతో అపార్ట్‌మెంట్స్‌లో ఇళ్లను క్వారంటైన్‌లా మార్చేందుకు పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానిక ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. పోలీసులపై దాడులకుసైతం స్థానిక ప్రజలు వెనుకాడటం లేదు. కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో షాంఘైలోనే కాకుండా కున్‌షాన్, షాన్‌షీ ప్రావిన్సు రాజధాని తైయువాన్, గువాన్‌ఝౌ, టాంగ్‌షాన్, లాంగ్‌ఫాంగ్‌తో పాటు పలు నగరాల్లో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో చైనాలోని దిగ్గజ కంపెనీలు మూతపడుతున్నాయి. ఐఫోన్ తయారీదారు పెగాట్రాన్ కార్పొరేషన్ వంటి సంస్థలతో పాటు టెస్లా, నియో వంటి కార్ల తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. మరికొన్ని రోజులు కొవిడ్ ఆంక్షలు ఇలానే కొనసాగితే వచ్చే నెలలో చైనా ఆటోమేకర్స్ ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందని వాహన తయారీ సంస్థలు చెబుతున్నాయి.
Wow, now I understand what "go viral" means。 現在明白什麼叫go viral 了。這個視頻好像創下我自己的最高紀錄了吧。
Someone wanted to defend the #CCP by saying the apartments don't belong to those people in #Shanghai. But here in the #US, we know how hard it is to evict a tenant… https://t.co/lobVnsE8es— Jennifer Zeng 曾錚 (@jenniferatntd) April 15, 2022
మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కొవిడ్ జీరో లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కఠిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పలు నివేదికలు చెబుతున్నప్పటికీ కొవిడ్ జీరో విధానానికే తాము కట్టుబడి ఉన్నామని జిన్ పింగ్ స్పష్టం చేశారు. అయితే ప్రజలు మాత్రం పలు ప్రాంతాల్లో ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.