China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్‌..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..

షాంఘైలో రోజు రోజుకీకరోనా టెన్షన్‌..పెరుగుతోంది. ‘జీరో పాలసీ’ని విధించి జనాలకు నరకం ప్రభుత్వం నరకం చూపిస్తోంది. దీంతో ప్రజలు పోలీసులపై తిరగబడుతున్నారు.

China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్‌..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..

China shanghai residents oppose china virus “Zero policy” :అత్యంత ధనిక జనాభా గల నగరమైన షాంఘైలో ప్రజలు ఆకలికేకలతో అల్లాడిపోతున్నారు.షాంఘైకి ఇలాంటి పరిస్థితి రావడం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. జనాల ఆకలి కేకల వెనక.. చావుల వెనక.. ప్రభుత్వ అసమర్థతే కారణమా.. షాంఘై పరిణామాలు ప్రపంచ దేశాలకు వినిపిస్తున్న సందేశం ఏంటి.. చైనా వ్యవహారంలో ఇప్పుడు ప్రపంచదేశాల వైఖరి ఎలా ఉంది..

ఓ పక్క కట్టడి చేసినా పెరుగతూనే ఉన్న కరోనా కేసులు. షాంఘైలో రోజురోజుకు పెరుగుతోన్న టెన్షన్‌..చైనా విధానాలపై ప్రపంచ దేశాలన్నీ ఫైర్‌ అవుతున్నాయి. చైనా దేశం టీకాలు పనిచేయవ్‌… పక్కదేశం నుంచి దిగుమతి చేసుకుంటుందా అంటే అదీ లేదు. అందుకే ప్రపంచ దేశాల్లో నార్మల్ పరిస్థితులు కనిపిస్తుంటే.. చైనా మాత్రం వైరస్ ధాటికి వణికిపోతోంది. కరోనా పుట్టించారో, పుట్టిందో ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ.. పుట్టినిల్లుపై మహమ్మారికి ప్రేమ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయ్. ఒక్క షాంఘైలోనే డెయిలీ కేసులు 25వేలకు పైనే నమోదవుతున్నాయ్. దీంతో లాక్‌డౌన్‌ నిబంధనలను చైనా సర్కార్‌ మరింత కఠినంగా అమలు చేస్తుండగా.. జనాలు అల్లాడిపోతున్నారు. చిన్న పామును పెద్ద కర్రగా కొట్టానుకోవడంలో తప్పు లేదు.. కొట్టే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి లేదంటే షాంఘైలోలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది.

Also read : China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు

ఏప్రిల్‌ 1 నుంచి షాంఘైలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. జీరో పాలసీ అని పేరు పెట్టి.. జనాలకు చైనా సర్కార్ నరకం చూపిస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా లాక్‌డౌన్ విధించి జనాలు ఆకలితో అలమటించేలా చేస్తోంది ప్రభుత్వం. ప్రతీరోజూ కరోనా పరీక్షలు తప్పనిసరి అంటూ నిబంధనలు విధించడం.. కోవిడ్ పేషంట్లు సరెండర్ కావాలని ఆదేశించడంలాంటివి.. నగరంలో పలు చోట్ల ర్షణకు కారణం అవుతున్నాయ్. నిజానికి చైనా అనుసరిస్తోన్న జీరో టోలరెన్స్ విధానంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయ్. ఐనా జిన్‌పింగ్ సర్కార్‌ ఈ విధానాన్నే ఫాలో అవుతోంది ఇంకా ! దీని వల్ల కరోనా మాట ఏమో కానీ… తినడానికి తిండి లేక జనాలు అలమటిస్తున్నారు.

షాంఘై నగరానికి చెందిన బిలియనీర్ క్యాథీ షెన్ అనే బిలియనీర్‌ సోషల్‌ మీడియా పోస్టు.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కోట్ల ఆస్తి ఉన్నా.. తినేందుకు బ్రెడ్డు ముక్క కూడా దొరకడం లేదని.. ఆకలి తీర్చాలని వేడుకుంటున్నారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోటీశ్వరుల పరిస్థితే ఇలా ఉంటే.. పేద ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా ఆర్థిక రాజధానిగా పేరు పొందిన షాంఘైకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అర్థం లేని పాలసీలతో.. జనాలను ఆకలితో చంపేస్తారా అన్న ఆందోళన కనిపిస్తోంది.

Also read : China Lockdown: చైనాను గడగడలాడిస్తున్న కరోనా.. ఆంక్షల చట్రంలో 87నగరాలు.. మూత పడుతున్న కంపెనీలు

షాంఘైలో పరిస్థితుల కారణంగా… కాన్సులేట్ సిబ్బంది నగరాన్ని వీడాలని అమెరికా తమ దేశ అధికారులను ఆదేశించింది. ఐతే ఈ నిర్ణయాన్ని చైనా తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. అమెరికా అధికారులు షాంఘై లాక్‌డౌన్‌ను కూడా దుష్ప్రచారానికి ఆయుధంలా వాడుకొనేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. తమ దేశం అనుసరించే అనుసరించే నివారణ, నియంత్రణ విధానాలు పూర్తిగా శాస్త్రీయమైనవి అని చెప్పుకొచ్చింది. ఇక అటు వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు షాంఘైలోని భారత కాన్సులేట్‌ తెలిపింది. తూర్పు చైనా ప్రాంతంలో ఉన్న భారతీయులు అత్యవసర సేవల కోసం బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఐతే పర్సనల్‌ సర్వీసులను నిలిపినా.. భారత పౌరులకు తమ సిబ్బంది రిమోట్ సేవలతో అందుబాటులో ఉంటారని చెప్పింది.

Also read : Tirupati Hospital : తిరుపతి ఆస్పత్రిలో మరణ మృదంగం..వారంలో తొమ్మిది శిశువులు మృతి

లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం చేయడమే కాదు.. కోవిడ్ రోగులను క్వారంటైన్‌ చేయడానికి.. కొందరిని చైనా పోలీసుల బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఈ విజువల్స్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. షాంఘై పరిణామాలు ప్రపంచానికి మిగిల్చిన సందేశం అంతా ఇంతా కాదు. కరోనా నియంత్రణకు ఎంత కఠినమైన నిబంధనలు విధించొచ్చు.. దానికి సామాన్యుల ప్రాణాలు బలిచేయొద్దు. అనాలోచిత నిర్ణయాలతో ఆకలికి కారణం కావొద్దు. ఇప్పటికైనా షాంఘై జనాల బాధలను తీర్చేందుకు చైనా ప్రభుత్వం సిద్ధం కావాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.