China Coronavirus: వణుకుతున్న చైనా.. ఒకేరోజు 56మంది మృతి..

: చైనా వణికిపోతుంది. ఆ దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే షాంఘైలో కొవిడ్ తీవ్రత తారాస్థాయికి చేరడంతో సోమవారం ఒక్కరోజే 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో...

China Coronavirus: వణుకుతున్న చైనా.. ఒకేరోజు 56మంది మృతి..

China

China Coronavirus: చైనా వణికిపోతుంది. ఆ దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే షాంఘైలో కొవిడ్ తీవ్రత తారాస్థాయికి చేరడంతో సోమవారం ఒక్కరోజే 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో కొవిడ్ మరణాల సంఖ్య 138కి చేరింది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు షాంఘైలో మూడు వారాలుగా లాక్ డౌన్ కొనసాగుతుంది. కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో షాంఘై వాసులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. తాజాగా లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తారని అనుకున్నప్పటికీ కొవిడ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.

China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్‌..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..

చైనాలోని ప్రధాన నగరాలన్నింటిల్లో కొవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లోనూ ఆంక్షలు షురూ అయ్యాయి. 2.1కోట్ల జనాభా కలిగిన చైనా రాజధాని బీజింగ్ లో 70 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో నూడిల్స్, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం బీజింగ్ వాసులు మార్కెట్లకు పరుగులు తీశారు. దీంతో సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు కనిపించాయి. ప్రజల డిమాండ్ కు సరిపడా సరుకులు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు

చైనా దేశం రాజధాని బీజింగ్ లో ప్రముఖులుండే చయోయంగ్ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుండి మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది.