Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!

ప్రపంచాన్ని గజగజా విణికిస్తోన్న కరోనా మహమ్మారికి ముగింపు ఉందా? నిర్మూలన చేయగలమా? అంటే సైంటిస్టులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వైరస్‌ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే అంటున్నారు.

Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!

Corona (3)

eradication of the corona is impossible : ప్రపంచాన్ని గజగజా విణికిస్తోన్న కరోనా మహమ్మారికి ముగింపు ఉందా? నిర్మూలన చేయగలమా? అంటే సైంటిస్టులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వచ్చే 3–6 నెలల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చన్న అంశంపై సైంటిస్టులు పరిశోధన జరిపారు. అయితే వచ్చిన సమాధానాలు ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పారు. వైరస్‌ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే అంటున్నారు. అందరికీ ఒక్కసారైనా సోకడం ఖాయమంటున్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయితేనే రక్షణ అంటున్నారు.

‘కరోనా కార్చిచ్చులాంటిది.. అడవి మొత్తం తగలబడే వరకు కార్చిచ్చు ఆరదు, అలాగే మానవాళి మొత్తానికి ఒక్కసారైనా సోకే వరకు కరోనా ఆగదు’ అని ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు అంటున్నారు. మానవాళి మరికొన్ని సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇమ్యూనిటీ పెరగడం కన్నా టీకాలతో ఇమ్యూనిటీ పెంచడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సినేషన్‌తోనే దీన్ని అరికట్టడం సాధ్యమని మరోమారు గుర్తు చేస్తున్నారు.

Covid-19 Cases : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. టీకాతో యాంటీబాడీల కొరత!

రాబోయే కాలంలో మళ్లీ కరోనా ప్రబలవచ్చని, దీనివల్ల స్కూళ్లు మూతపడడం, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కొత్త ఇన్‌ఫెక్షన్‌ భయాలు పెరగడం, ఆస్పత్రులు కిటకిటలాడటం జరగవచ్చని హెచ్చరించారు. కరోనాకు నిజమైన ముగింపు వచ్చే లోపు ప్రపంచంలో ప్రతిఒక్కరూ దీని బారిన ఒక్కసారైనా పడటం లేదా వ్యాక్సిన్ వేయించుకోవడం జరుగుతుందన్నారు. కొంతమందికి రెండు సార్లు కరోనా సోకే ప్రమాదం కూడా ఉండొచ్చన్నారు. అందరికీ కరోనా సోకేవరకు వేవ్స్‌ రాకడ ఆగకపోవచ్చని అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, తిరిగి తగ్గడం గమనించవచ్చని అమెరికా సైంటిస్టు మైకేల్‌ ఓస్టర్‌ హామ్‌ అభిప్రాయపడ్డారు.

COVID-19 : వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఈ 4 కారణాల వల్లే కరోనా సోకుతోంది!

వైరస్‌ల్లో వచ్చే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతాయన్నది తెలిసిందే! కరోనాలో మ్యుటేషన్‌ మెకానిజం ఇతర వైరస్‌లతో పోలిస్తే మెరుగ్గా ఉంది. గత వేరియంట్లలో లోపాలను దిద్దుకొని కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తున్నాయి. ఇందువల్ల రాబోయే కాలంలో ఫ్లూలాగానే ఎప్పటికప్పుడు కరోనాకు వ్యాక్సిన్ (బూస్టర్‌ డోస్‌లు) టాప్‌అప్‌లు తీసుకోవాల్సిరావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కొన్ని మ్యుటేషన్ల అనంతరం ఫస్ట్‌ జనరేషన్‌ వ్యాక్సిన్లను తట్టుకునే వేరియంట్‌ రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కొత్త రకం ఫ్లూ వైరస్‌ మానవాళిపై దాడి చేసే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ శాస్త్రవేత్త కంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. 5, 6 నెలల్లో మాత్రం కరోనా మాయం కాకపోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ప్రపంచ జనాభాలో 95 శాతం వరకు ఇమ్యూనిటీ(కరోనా సోకి తగ్గడం వల్ల లేదా వ్యాక్సిన్ వల్ల) వస్తేనే కరోనా మాయం అవుతుందని చెబుతున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీకి అత్యుత్తమ మార్గం వ్యాక్సినేషనేనని చెప్పారు. కరోనా ముగింపు ప్రపంచమంతా ఒకేదఫా జరగకపోవచ్చని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో కరోనా మాయం అవుతుందని అంచనా.

Inhaled Steroids : కరోనా బాధితులకు ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌..!

ఓ వైపు కోట్లాదిమందికి వ్యాక్సిన్ అందలేదు, మరోపక్క ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. ఈ రెండింటి సమ్మేళనంతో మరలా కేసులు పెరగవచ్చని మైకేల్‌ అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెరిగినా, వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉన్నవారు(ఉదాహరణకు పసి పిల్లలు, వ్యాక్సిన్ అందని వారు, బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడేవారు) ఎప్పుడూ ఉంటారన్నారు. రానున్న కొన్ని నెలలు ప్రమాదమని, ముఖ్యంగా వ్యాక్సిన్ నిరోధక వేరియంట్‌ వస్తే మరింత ప్రమాదమని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 130 ఏళ్ల క్రితం మనిషిని ఐదు మార్లు వణికించిన ఇన్‌ఫ్లుయెంజా మహమ్మారి ఉదంతాన్ని గమనిస్తే కరోనా భవిష్యత్‌పై ఒక అంచనా రావచ్చని భావిస్తున్నారు.

వీటిలో ఒక దఫా ఐదేళ్లు మానవాళిని పీడించింది. ఆ ఐదేళ్లలో 2–4 వేవ్స్‌ వచ్చాయి. దీనికన్నా కరోనా ప్రమాదకారని, కనుక థర్డ్‌వేవ్‌ తప్పదని లోనే సిమన్‌సన్‌ అనే సైంటిస్టు అభిప్రాయపడ్డారు. అధిక వ్యాక్సినేషన్లు, ఆధునిక సౌకర్యాలున్న అగ్రరాజ్యాల్లో సైతం మరలా కేసులు పెరుగుతున్న సంగతి గుర్తు చేశారు. వ్యాక్సిన్స్ వల్ల మరణాలు తగ్గవచ్చని, కానీ కేసులు పెరగడం ఆగకపోవచ్చని వెల్లడించారు. ముఖ్యంగా టీకాలు పెద్దగా కనిపించని మెక్సికో, ఇరాన్‌ లాంటి దేశాల్లో డెల్టాతో డేంజర్‌ పెరగవచ్చని తెలిపారు. కాలం గడిచేకొద్దీ వైరస్‌లు బలహీనపడతాయన్న అపోహ వద్దని పేర్కొన్నారు.