Covid-19 Cases : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. టీకాతో యాంటీబాడీల కొరత!

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా దేశవ్యాప్తంగా 28వేల 591 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 338 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

Covid-19 Cases : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. టీకాతో యాంటీబాడీల కొరత!

Covid 19 Cases Down From Nationalwide, Vaccine Antibodies Shortage

Vaccine Antibodies shortage : దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా దేశవ్యాప్తంగా 28వేల 591 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 338 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికశాతం కేరళ నుంచే రికార్డవుతున్నాయి. కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రభావం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేల‌కు త‌గ్గడంలేదు. తాజాగా 20 వేల 240 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 67 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 22 వేల 551కి చేరింది.
Putian : కరోనా ఉధృతి..చైనాలోని ఆ సిటీలో రైళ్లు,బస్సులు బంద్

మరోవైపు ఢిల్లీ కరోనా తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఒక వెయ్యి 190 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 110 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా 249 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వేల 258 యాక్టివ్ కేసులున్నాయి.

వ్యాక్సిన్ రెండు డోసులైనా.. 
కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. అందరికి యాంటీబాడీలు అభివృద్ధి చెందడం లేదు. ఒడిశాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఒడిశాలో టీకా రెండు డోసులు తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని స్పష్టం చేసింది. యాంటీబాడీ జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. వారికి బూస్టర్‌ డోస్ అవసరమని సూచించింది.

Taliban : మహిళలు పీజీ, పీహెచ్‌డీ చదవొచ్చు.. బుర్ఖాలు మస్ట్.. కానీ!