Putian : కరోనా ఉధృతి..చైనాలోని ఆ సిటీలో రైళ్లు,బస్సులు బంద్

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్  కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.

Putian : కరోనా ఉధృతి..చైనాలోని ఆ సిటీలో రైళ్లు,బస్సులు బంద్

China

Putian ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్  కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. ఇక మొదటిసారిగా వైరస్ వెలుగులోకివచ్చిన చైనాలో​ మళ్లీ కరోనా కలవరం సృష్టిస్తోంది. గతేడాది జనవరిలో వైరస్​ వ్యాప్తిని నిలువరించామని ప్రకటించిన ఆ దేశంలో డెల్టా వేరియంట్​ ఉద్ధృతితో వివిధ నగరాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

దక్షిణ చైనాలోని ఫుజియాన్​ రాష్ట్రంలోని పుతియాన్​ నగరంలో కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పుతియాన్​లో శనివారం కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఫుజియాన్ రాష్ట్రంలోని మరో నగరమైన క్వాన్​జోవులో ఒక కేసు నమోదైనట్లు పేర్కొంది. షియాన్హు కౌంటీ నుంచి వచ్చిన కొందరు విద్యార్థుల కారణంగా.. పుతియాన్​లో కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుతియాన్​ నగరంలో సినిమా హాళ్లు, జిమ్​లు, పర్యాటక ప్రదేశాలతో పాటు జనం గుమికూడే అన్ని రకాల ప్రదేశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే రెస్టారెంట్లు, సూపర్​ మార్కెట్లు.. నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించవచ్చని తెలిపారు. ప్రజలెవరూ నగరం దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

బస్సు, రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వెళ్లేవారు 48 గంటల ముందు కొవిడ్​ నెగెటివ్​గా తేలిన సర్టిఫికెట్ చూపించాలని స్పష్టం చేశారు.  పుతియాన్​లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్లు చైనా ఎన్​హెచ్​సీ తెలిపింది.