Inhaled Steroids : కరోనా బాధితులకు ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌..!

కరోనా బాధితులకు ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ అందించారు. కేరళ రాష్ట్రంలోని కరోనా మొదటి వేవ్ కొనసాగుతున్న సమయంలో వైద్యులు వైరస్ బాధితులకు ఈ ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ ఇచ్చినట్టు వెల్లడించారు.

10TV Telugu News

Inhaled Steroids : కరోనా బాధితులకు ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ అందించారు. కేరళ రాష్ట్రంలోని కరోనా మొదటి వేవ్ కొనసాగుతున్న సమయంలో వైద్యులు వైరస్ బాధితులకు ఈ ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ అంటే.. ముక్కు లేదా నోటీ ద్వారా పీల్చుకునే సాధనం… ఈ ఇన్ హేలర్స్ ఎక్కువగా ఆస్తమా బాధితులు వాడుతుంటారు. తద్వారా సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. కరోనా బాధితులకు ఇన్ హేలర్స్ ద్వారా స్టెరాయిడ్స్ ఇవ్వడంపై పరిశీలిస్తున్నారు.
Zomato : నిత్యావసర సరుకుల డెలివరీకి గుడ్‌బై చెప్పిన జొమాటో

కేరళలో చాలామంది కరోనా బాధితులకు బుడొజినైట్‌ స్టెరాయిడ్‌ను ఇన్‌హేలర్‌ ద్వారా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య బృందం కేరళకు వెళ్లిన సమయంలో దీనిపై పరిశీలిన చేశారు. కేరళలో కరోనా బాధితుల్లో చాలామందిలో బాగా దగ్గుతో బాధపడుతూ, 94 కంటే ఆక్సిజన్‌ శాతం పడిపోతే ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌ ఇచ్చినట్టు అక్కడి వైద్యులు చెప్పారని బృందం సభ్యులు సాంబశివారెడ్డి తెలిపారు. ఏపీలోనూ ఈ తరహా పరిశీలన చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు.

ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌పై ఏపీలోనూ పరిశీలన చేయనున్నామని తెలిపారు. వీడి వాడకంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదో పరిశీలించాల్సి ఉందన్నారు. స్టెరాయిడ్స్ వాడితే ఎంతవరకు కరోనా నియంత్రణలోకి వస్తుందనే అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. స్టెరాయిడ్స్‌ ఇంట్రా వీనస్‌ (నరాల) నుంచి పంపిస్తున్నారు. నోరు లేదా ముక్కు ద్వారా పీల్చితే ఎంతవరకు పనిచేస్తాయనేది తెలియాలి. కేరళలో కరోనా ఫలితాలపై ప్రత్యేక డేటా ఏమీ లేదన్నారు.

ఏపీలో ముందుగా పలువురు వైద్యనిపుణులతో చర్చించాల్సి ఉందని, ఆ తర్వాతే అమలుకు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా పెరిగిన సమయంలో, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తరహా ఇన్ హేలర్ స్టెరాయిడ్స్ అందించాలని సూచిస్తున్నారు. సాధారణ పేషెంట్లకు ఇచ్చే పరిస్థి లేదన్నారు. కేరళలో స్టెరాయిడ్స్‌ వినియోగంపై అక్కడి వైద్యనిపుణులతో చర్చించనున్నట్టు వెల్లడించారు.
Helmets Safety : హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

×