Zomato : నిత్యావసర సరుకుల డెలివరీకి గుడ్‌బై చెప్పిన జొమాటో

నిత్యావసర సరుకుల డెలివేరిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు జొమాటో తెలిపింది. సెప్టెంబర్ 17నుంచి ఈ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Zomato : నిత్యావసర సరుకుల డెలివరీకి గుడ్‌బై చెప్పిన జొమాటో

Zomato

Zomato : సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఏది కావాలన్నా ఇంటివద్దకె వస్తోంది. గతంలో నిత్యావసర సరుకులు కావాలంటే తప్పని సరి గ్రోసరీ షాపుకు వెళ్లాల్సి వచ్చేది. ఇక బిర్యానీ అంటే రెస్టారెంట్ కి వెళ్లి తినాల్సిందే.. జొమాటో వచ్చిన తర్వాత ఇదంతా మారిపోయింది. మనకు కావాల్సినవి జొమాటో యాప్ లో బుక్ చేసుకుంటే ఇంటివద్దకు వచ్చి ఇచ్చేవారు. అయితే ఇకపై నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలు నిలిపివేస్తున్నట్లు జొమాటో తెలిపింది.

Read More : Zomato : నిత్యావసర సరుకుల డెలివరీకి గుడ్‌బై చెప్పిన జొమాటో

సెప్టెంబర్ 17 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్నీ తమ కంపెనీ భావస్వాములకు ఈ-మెయిల్ ద్వారా తెలిపింది. ‘జొమాటోలో మా వినియోగదార్లకు ఉత్తమ సేవలను, వ్యాపార భాగస్వాములకు అతిపెద్ద వృద్ధి అవకాశాలను అందించాలని భావిస్తున్నాము. ఇందుకు ప్రస్తుత మోడల్‌ ఉత్తమ మార్గం అని మేము నమ్మడం లేదు. అందుకే ఈ పైలట్‌ గ్రాసరీ డెలివరీ సేవలను నిలిపివేయాలని అనుకుంటున్నాము’ అని ఈ–మెయిల్‌ ద్వారా తెలిపింది. ‘స్టోర్లలో వస్తువుల జాబితా క్రియాశీలకం. నిల్వ స్థాయిలూ తరచూ మారుతున్నాయి. దీని కారణంగా ఆర్డర్లలో అంతరం ఏర్పడి పేలవమైన కస్టమర్ల అనుభూతికి దారితీస్తోంది.

Read More : Engagement : డిగ్రీ పూర్తైందని నమ్మించి నిశ్చితార్థం

జొమాటో వేదిక ద్వారా ఇకపై సరుకుల డెలివరీ చేయబోమని తెలిపింది. జొమాటో వేదిక ద్వారా సరుకుల డెలివరీ ప్రయత్నాల కంటే గ్రోఫర్స్‌లో గ్రోఫర్స్‌లో కంపెనీ పెట్టుబడులు భాగస్వాములకు మెరుగైన ఫలితాల ను ఇస్తాయి’ అని జొమాటో స్పష్టం చేసింది. కాగా, గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటా కోసం రూ.745 కోట్లు వెచ్చించినట్లు జొమాటో గతంలో తెలిపింది.