Big Boss 5: హౌస్ నుండి బయటికెళ్ళాక శివాలెత్తిన సరయు..!

బిగ్‌బాస్ ఈ సీజన్ చకచకా జరిగిపోతుంది. పాపులర్ తెలుగు రియాలిటీ షోగా ఓ క్రేజ్ దక్కించుకున్న ఈ సీజన్ లో తొలివారం ఎలిమినేషన్ కూడా ముగిసింది. హోస్ట్ నాగార్జున వస్తున్నాడనగానే

Big Boss 5: హౌస్ నుండి బయటికెళ్ళాక శివాలెత్తిన సరయు..!

Big Boss 5 (3)

Updated On : September 13, 2021 / 8:49 AM IST

Big Boss 5: బిగ్‌బాస్ ఈ సీజన్ చకచకా జరిగిపోతుంది. పాపులర్ తెలుగు రియాలిటీ షోగా ఓ క్రేజ్ దక్కించుకున్న ఈ సీజన్ లో తొలివారం ఎలిమినేషన్ కూడా ముగిసింది. హోస్ట్ నాగార్జున వస్తున్నాడనగానే సండే ఫండేగా మారుతుందని అనుకున్నారు. కానీ తొలివారమే ఎలిమినేషన్ తో షోను ఎమోషనల్‌గా కూడా మార్చాడు. అయితే, ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడిస్తూనే ఫన్ జనరేట్ చేసి ఎలిమినేషన్ ప్రాసెస్‌ను ముందుకు తీసుకెళ్లడం కాస్త బెటర్ ఫీల్ అనిపించింది. ఇంటి సభ్యుల మధ్య ఉన్న రిలేషన్స్‌ను, అలాగే వారి నిక్‌నేమ్స్‌ను బయటకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఎలిమినేషన్ పూర్తి చేశాడు.

Big Boss 5: సరయు తొలివారమే ఎలిమినేషన్.. అభిమానులు కోరుకున్నదేనా?

కాగా, వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన సరయూ వారం రోజులకే వెనుదిరిగింది. బయట అందరినీ గడగడలాడించే ఆమె హౌస్‌లో ఎక్కువరోజులు ఉండలేకపోయింది. మొదటివారంలోనే నామినేషన్‌లో నిలిచి తక్కువ ఓట్లతో హౌస్‌ నుంచి నిష్క్రమించింది. కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికిన సరయూ స్టేజీ మీదకు వచ్చాక మాత్రం పూనకంతో ఊగిపోతూ శివాలెత్తింది. స్టేజి మీద నాగ్ ఎదురుగానే హౌస్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంటుకు ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది.

Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!

హౌస్‌ నుండి బయటకి రాగానే సరయుతో నాగ్.. 5 బెస్ట్‌, 5 వరస్ట్‌ హౌస్‌మేట్స్‌ చెప్పమంటూ గేమ్‌ ఆడించాడు. ముందుగా ఐదురుగు బెస్ట్‌ కంటెస్టెంట్ట గురించి చెప్తూ ఎమోషనల్‌ అయిన సరయూ.. శ్వేత, మానస్‌, ప్రియాంక, విశ్వ, హమీద గురించి చెప్పింది. వరస్ట్‌ కంటెస్టెంట్లుగా సిరి, షణ్ముఖ్‌, లహరి, సన్నీ, కాజల్‌ను ఎంచుకున్న సరయూ వాళ్ల గురించి చెప్తూ శివాలెత్తింది. వీరంతా ముందు ఒకలా, వెనక మరోలా ఉంటున్నారని.. సిరి, షణ్ముఖ్‌ అయితే ముందుగానే ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్‌ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది.

Big Boss 5: హౌస్ నుండి బయటికెళ్ళాక శివాలెత్తిన సరయు..!

లహరిని ఓ రేంజ్‌లో ఆడుకుంది. ‘ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి.. ఆ టోన్‌ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు’ అని రెచ్చిపోయింది. ఇక సన్నీ గతంలో ఓ సినిమా చేస్తున్న సమయంలో జరిగిన ఒక గొడవ కారణంగా తనపై కక్ష్య పెంచుకున్నాడని చెప్పిన సరయూ.. షణ్ముఖ్‌.. అరేయ్‌ ఏంట్రా ఇది.. బయటే అనుకుని ఇలా రావొద్దురా.. అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇక కాజల్‌ను కూడా వరస్ట్‌ కంటెస్టెంట్స్‌ లిస్టులో చేర్చిన సరయూ ఇకైనైనా ఆమె బుర్ర పెట్టి ఆడాలని సలహా ఇచ్చింది.