Helmets Safety : హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? ఎలాంటి హెల్మెట్లు వాడుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త.. రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్లు ధరించడం తప్పనిసరి..

Helmets Safety : హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Is Helmet Mandatory For Bikers

Helmets Safety : హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? ఎలాంటి హెల్మెట్లు వాడుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త.. రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్లు ధరించడం తప్పనిసరి.. తలకు గాయాలు కాకుండా కాపాడేది హెల్మెట్ అనేది గుర్తించుకోవాలి. రోడ్డుప్రమాదాల్లో తలకు బలంగా గాయమైతే.. ఎప్పటికైనా ప్రాణాలకు ప్రమాదమే.. అపస్మార స్థితిలోకి వెళ్లిపోతారు. సెకన్ల పాటు స్పృహ కోల్పోతారు.. తీవ్రమైన తలనొప్పి, అయోమయంగా అనిపిస్తుంది. తల తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. దృష్టి మాసకబారిబోతుంది.
Engagement : డిగ్రీ పూర్తైందని నమ్మించి నిశ్చితార్థం

చెవిలో హోరున శబ్దంగా అనిపిస్తుంది. రుచి తెలియదు.. అలసటగా అనిపిస్తుంది. నిద్రించే సమయంలో మానసిక ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. హెల్మెట్ ఆషామాషీగా హెల్మెట్ ధరించకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యంగా హెల్మెట్ ధరించినవారే ఎక్కుమంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్నారని చెబుతున్నారు. హెల్మెట్ ధరించిన క్రమంలో మెడ కింద బెల్టు సక్రమంగా పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరిగే సమయాల్లో పక్కకు ఎగిరిపోయి తలకు గాయాలవుతున్నాయని అంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు చాలామందికి వెన్నుముక, తలకు తీవ్ర గాయాలు అవుతున్నాయి. కారులో ప్రయాణించే సమయంలో సీటు బెల్టు ధరించకపోవడం, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరిగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బైక్‌లపై వెళ్లేసమయాల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ శాతం తల రోడ్డుకు తగిలి గాయాలవుతున్నాయి. గాయం బలంగా తగిలినప్పుడు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోతున్నారు.

కొంతమంది ప్రాణాలతో బయటపడినా.. తలకు తగిన బలమైన గాయాలతో జీవితాంతం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యువహీరో సాయిధరమ్‌తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నాణ్యమైన హెల్మెట్‌ ధరించడం వల్ల ఆయన గాయాలతో బయట పడ్డారని అంటున్నారు. అందుకే రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

తీవ్రగాయాలైతే.. తలనొప్పి వేధించడం, వాంతులు, వికారం, ఫిట్స్‌, మాట్లాడలేకపోవడం, ఏదైనా అవయవంలో తిమ్మర్లు, తీవ్ర అయోమయం వంటి లక్షణాలు కన్పిస్తాయి. తల బయట ఎలాంటి గాయం లేకపోయినా రోడ్డు ప్రమాదంలో తల తీవ్రంగా అదిరిపడినప్పుడు లోపల తీవ్ర గాయమవుతుంది. పుర్రె గోడలకు తగిలి మెదడు చిట్లిపోతుంది. మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని హెమటోమాకు దారితీస్తుంది. హెల్మెట్‌ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు తగలకుండా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా నాణ్యమైన కంపెనీ, ఐఎస్‌ఐ మార్కు కలిగిన హెల్మెట్లను కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Minor Rape : ముంబైలో మరో దారుణం.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం