COVID-19 : వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఈ 4 కారణాల వల్లే కరోనా సోకుతోంది!

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం ఉండదంతే. కానీ, కరోనా టీకా వేయించుకున్నప్పటికీ వైరస్ సోకే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

COVID-19 : వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఈ 4 కారణాల వల్లే కరోనా సోకుతోంది!

Vaccinated But Still Infected With Covid 19 4 Reasons Why

Vaccinated But Still Infected With COVID-19 : కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం ఉండదు. కానీ, కరోనా టీకా వేయించుకున్నప్పటికీ వైరస్ సోకే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలామంది వ్యాక్సినేషన్ అనంతరం కూడా కరోనా బారిన పడుతున్నారు. ఎందుకిలా జరుగుతోందంటే.. సాధారణంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న రెండు వారాల తర్వాతే టీకా యాంటీబాడీలు తయారవుతాయి. అప్పుడే వాటి ప్రభావం అధికంగా ఉంటుంది. కానీ, పూర్తిగా టీకాలు వేసిన తర్వాత కూడా కరోనా సోకుతోంది.

‘బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్..’ అని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ అసలు వ్యాక్సిన్ వేయించుకోనివారితో సమానంగా ఉంటుంది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారిలో తలనొప్పి, ముక్కు కారటం, తుమ్ములు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు, టీకాలు వేయని వ్యక్తిలో అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, నిరంతర దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
Covid-19 : కేరళలో కరోనా కల్లోలం.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు ఇక్కడి నుంచే

అసలు టీకాలు వేయని వ్యక్తి కంటే.. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలో జ్వరం వచ్చే అవకాశం 58శాతం తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. ప్రతి 500 మందిలో ఒకరు పూర్తిగా టీకాలు వేసినప్పటికీ.. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని అధ్యయనంలో గుర్తించారు. ఒక వ్యక్తికి పూర్తిగా టీకాలు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్-19 బారిన పడే ప్రమాదం ఉంది. అందుకు ఈ ముప్పును నియంత్రించాలంటే ఈ నాలుగు విషయాలు తప్పక గుర్తించాలి.

1. అది ఏ రకం టీకా :
ఒక వ్యక్తికి మోడర్నా టీకా ఇస్తే.. కరోనా సోకినప్పుడు వారిలో అభివృద్ధి చెందే లక్షణాల ప్రమాదం 94శాతం తగ్గుతుందని క్లినికల్ ట్రయల్‌లో వెల్లడైంది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ ప్రమాదాన్ని 95శాతం తగ్గిస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ 66శాతం, ఆస్ట్రాజెనెకా 70శాతం సమర్థతను కలిగి ఉంది.

2. టీకా వేసిన సమయం నుంచి :
2. వ్యాక్సినేషన్ తర్వాత 6 నెలల వ్యవధిలో ఫైజర్ వ్యాక్సిన్ సామర్థ్యం క్షీణిస్తుందని తొలి పరిశోధనలో వెల్లడైంది. డబుల్ డోస్‌ల సామర్థ్యం ఎప్పుడు మాయమవుతుందో ఇప్పటికీ తెలియదు.
Tollywood Drugs Case : డ్రగ్స్ సినీ ఫీల్డ్‌లోనే కాదు.. అన్ని చోట్లా ఉన్నాయి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు..

3. వేరియంట్లు..
ఒక వ్యక్తికి సోకిన వైరస్ వేరియంట్ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. అదే ఆల్ఫా వేరియంట్‌ సోకితే.. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు కొద్దిగా తక్కువ రక్షణ కలిగి ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా లక్షణాలను పొందే రిస్క్ 90శాతం తగ్గింది. అదే డెల్టా వేరియంట్‌ రిస్క్ 88శాతం తగ్గింది.

4. రోగనిరోధక వ్యవస్థ :
కరోనా ద్వారా వ్యాపించే ముప్పు.. ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఒకరి రోగనిరోధక శక్తి.. ఇతర వ్యక్తులపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది.. అలాగే వారు వైరస్ బారిన పడే ప్రమాదం ఎంత ఉంటుందో నిర్ధారించవచ్చు. యువకుల కంటే వయస్సులో పెద్దవారిలో రోగనిరోధక శక్తి కొద్దిగా బలహీనంగా ఉంటుంది. దీర్ఘకాలిక వైద్య అనారోగ్యంతో టీకాల ప్రభావాన్ని దెబ్బతీస్తుంది. ఈ కారణాలు అనేవి వ్యక్తికి వ్యక్తికి మధ్య మారవచ్చు. కానీ, మన జీవనశైలిలో ఎప్పటికప్పుడూ అవసరమైన మార్పులు చేసుకుంటూ ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుంది.
Eye Health : పొగతాగే వారికి పొంచి ఉన్న ప్రమాదం