Gold Rate Today : ఫెడ్ దెబ్బకు బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఈరోజు 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే
Gold Rate Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే వారం రోజుల్లో బంగారం రేటు మరింతగా..
Gold Rate Today
Gold Rate Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కోరోజు గోల్డ్ రేటు పెరుగుతుండగా.. మరో రోజు తగ్గుతుంది. ఇలా.. గడిచిన పది రోజుల్లో 24క్యారట్ల బంగారంపై రూ. 6వేలకుపైగా తగ్గుదల చోటు చేసుకోగా.. అదే సమయంలో సుమారు రూ.3500 పెరిగింది. అయితే, వచ్చే వారం రోజుల్లో బంగారం రేటు మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా సుంకాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు సన్నగిల్లడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వచ్చే వారం రోజుల్లోనూ గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఐదు డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,065 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,840కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,500కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,25,990కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,350 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,25,840కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,72,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,64,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,64,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
