Biker: శర్వా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. బైకర్ వాయిదా.. అఖండ ఎఫెక్ట్ కారణమా..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్(Biker). దర్శకుడు అభిలాస్ కంకర తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Biker: శర్వా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. బైకర్ వాయిదా.. అఖండ ఎఫెక్ట్ కారణమా..

Sharwanand Biker movie postponed

Updated On : November 23, 2025 / 9:26 AM IST

Biker: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్(Biker). దర్శకుడు అభిలాస్ కంకర తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మరో స్పెషల్ రోల్ ఏంటంటే.. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. టీజర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా పాటను విడుదల చేశారు. ఆ పాటకు ఆడియన్స్ నుంచి కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక శర్వా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Balakrishna: ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే వారసుడి ఎంట్రీ.. తేల్చి చెప్పిన బాలకృష్ణ.. దర్శకుడు ఎవరో తెలుసా..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కారణం ఏంటంటే, బైకర్ సినిమాలో చాలా వీఎఫెక్స్ షాట్స్ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వీఎఫెక్స్ షాట్స్ వర్క్ ఇంకా కంప్లీట్ అవలేదు. కాబట్టి, ఎదో చేశాం అంటే చేశాం అని కాకుండా.. మంచి క్వాలిటీతో ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట మేకర్స్. అందుకే, ఈ సినిమా వాయిదా వేయాలని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో, శర్వా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాను ఒక వారం వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ, రిలీజ్ ఎప్పుడు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.