మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు.. నందమూరి నటసింహం బాలయ్య అఫిషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది. రీసెంట్ గా అయన చేసిన 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్ సాధించాయి. వాటిలో అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, దాకు మహారాజ్.

మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు.. నందమూరి నటసింహం బాలయ్య అఫిషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..

Balakrishna says his son will make his debut as a hero with Aditya 999 Max

Updated On : November 23, 2025 / 12:49 PM IST

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది. రీసెంట్ గా అయన చేసిన 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్ సాధించాయి. వాటిలో అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, దాకు మహారాజ్. ఇలా ఒకటితరువాత ఒకటి అంటూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు బాలయ్య. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓపక్క కుర్ర హీరోలు సైతం హిట్స్ కోసం ఎదురుచూస్తుంటే బాలయ్య మాత్రం హిట్స్ కి కేరాఫ్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తున్న మరో మాస్ మూవీ అఖండ 2. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Rashi Khanna: అభిమానులు దూరంగానే ఉండాలి.. అదే ఇద్దరికీ మంచిది.. రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్..

ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవల గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యారు. ఘనంగా జరుగుతున్న ఈ ఈవెంట్ లో ఆయనకు అరుదైన గౌరవడం దక్కింది. సినిమా ఇండస్ట్రీలో గత 50 ఏళ్లుగా అయన అందిస్తున్న సేవలకు గాను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన సినిమా కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే, త డ్రీం ప్రాజెక్టు ఆదిత్య 39 సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “‘ఆదిత్య 999 మ్యాక్స్‌ తో నా కుమారుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. భారీ స్థాయిలో రానున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ.

దీంతో వారసుడి ఎంట్రీ ఇచ్చిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అలాగే నందమూరి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నందమూరి మోక్షజ్ఞ విషయానికి వస్తే, గతంలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రానుంది అంటూ అధికారిక ప్రకటన చేశారు. కానీ, ఆ ప్రజెక్టు ఇంకా మొదలవలేదు. తాజాగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ తో ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ ప్రాజెక్టు గురించి చర్చ మొదలయ్యింది. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.