Rashi Khanna: అభిమానులు దూరంగానే ఉండాలి.. అదే ఇద్దరికీ మంచిది.. రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్..
స్టార్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna) చేసిన కామెంట్స్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఎప్పుడు దూరంగానే ఉండాలి అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి.
Star beauty Raashi Khanna makes shocking comments about fans
Rashi Khanna: చాలా మంది స్టార్స్ తమకు తెలియకుండానే వివాడాలలో చిక్కుకుంటూ ఉంటారు. కామెంట్స్ చేసేటప్పుడు అంత వైరల్ అవుతాయని అనుకోరు కానీ, ఒకసారి చూశాక దాని ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా ఇంత డెవలప్ కాలేదు కాబట్టి ఎవరు ఏమన్నా తొందరగా తెలిసేది కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎవరు మాట్లాడినా క్షణాల్లో తెలిసిపోతుంది. దాంతో, అలాంటి కామెంట్స్ కాస్త వివాదాలను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా స్టార్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna) చేసిన కామెంట్స్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఎప్పుడు దూరంగానే ఉండాలి అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి.
రీసెంట్ గా రాశి ఖన్నా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రాశిని మీరు ఒక అభిమానిని డేట్ చేయాల్సి వస్తే చేస్తారా? అని అడిగారు. దానికి సమాధానంగా రాశి మాట్లాడుతూ..”నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళు మనల్ను అభిమానిస్తూ వాళ్ళ జీవితంలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. అలాగే, తాము అభిమానించే వ్యక్తులు తమకు దూరంగా ఉన్నప్పుడు ఒకలా.. దగ్గరగా ఉన్నపుడు ఒకలా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి, అభిమానులు ఎప్పుడు తమను అభిమానించే వ్యక్తులకు దూరంగానే ఉండాలి. ఆలా ఉంటేనే మంచిది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ కంటెంట్ మూవీ యావరేజ్ రిజల్ట్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం రాశి ఖన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
