Shiva Jyothi: నన్ను క్షమించండి.. అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. తిరుమల ప్రసాదం వివాదంపై స్పందించిన శివజ్యోతి
యాంకర్ శివజ్యోతి(Shiva Jyothi) సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఆమె తిరుమల ప్రసాదంపై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.
Anchor Sivajyothi apologizes for Tirumala Prasadam controversy
Shiva Jyothi: యాంకర్ శివజ్యోతి(Shiva Jyothi) సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఆమె తిరుమల ప్రసాదంపై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. ప్రసాదం అడుక్కుంటున్నాం అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ప్రసాదంపై వెకిలిగా కామెంట్స్ చేశారు అంటూ ఆమెపై మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. వివాదం తీవ్రమవడంతో తాజాగా శివజ్యోతి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.
Rashmika Mandanna: స్త్రీశక్తి ఒక అద్భుతం.. ఏకమైతే ఎవరు ఆపలేరు.. అందరు అలా ఉండాలి..
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..”తిరుమల ప్రసాదం గురించి నేను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. దాని గురించి వివరణ ఇచ్చే ముందు నా మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్తున్నాను. నేను రిచ్ అనే పదం వాడింది కేవలం రూ.10,000 ఎల్1 క్యూ లైన్‌లో నిలబడినం అని కాదు, కాస్ట్‌లీ లైన్‌లో నిల్చున్నాం అనే ఉద్దేశంతో అన్నవి. నన్ను రెగ్యులర్ ఫాలో అయ్యేవారికి తెలుసు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో. నేను గత నాలుగు నెలల నుంచి శనివారాల వ్రతాలు చేస్తున్నాను. నాకు అత్యంత విలువైనది నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. అలాంటిది ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా. కాబట్టి, నా ఇంటెన్షన్ అది కాదు. నా మాటలు తప్పుగా అయ్యుండొచ్చు. ఎవరో ఎదో అన్నారు, మాపై కేసులు పెడతారెమో అనే భయంతో కాదు. అలా మాట్లాడటం నాకు కూడా తప్పు అనిపించింది. అట్లా మాట్లాడి ఉండకూడదని. అందుకే.. సారీ చెప్తున్నా. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
View this post on Instagram
