కోవిడ్ వ్యాక్సిన్ రేపే విడుదల! రష్యా టీకాను ఎంతమంది తీసుకోగలరు?

మనం అనుకున్నట్లుగా కరోనా వ్యాక్సిన్ ను కేవలం సిల్వర్ బుల్లెట్ అయిపోదు. ప్రయోగాత్మక టెస్టుల్లో సక్సెస్ అయిపోయి ప్రతి వ్యక్తి చేతిలోకి వస్తుందనుకోవడానికి లేదు. మనం ఇప్పటికీ యాక్చువల్, వర్కింగ్, సేఫ్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, అందులో గ్యారంటీ ఏం కనిపించడం లేదు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా.. ఉత్పత్తి చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి వందల మిలియన్లు లేదా బిలియన్లలో డోసులు రెడీ కావాలి.



ఇలా అంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ రెడీ చేసి పంపేసరికి వ్యాక్సిన్ తీసుకుంటారా లేదా అనేది మరో డౌట్. 35 శాతం మంది అమెరికన్లు ఫ్రీగా ఇచ్చినా వ్యాక్సిన్ తీసుకోవడానికి నో చెప్తున్నారు.

సొసైటీకి సందేహాత్మకంగా వ్యాక్సిన్
కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పబ్లిక్ పాలసీ అండ్ సోషియాలజీ ప్రొఫెసర్ రిచర్డ్ కార్పియానో వ్యాక్సిన అందరికీ అందడంపై ఓ ఇంటర్వ్యూలో పలు అనుమానాలు లేవనెత్తారు.



‘వ్యాక్సిన్ అందుతుందా లేదా అని చర్చించేటప్పుడు ప్రజల గురించి మాత్రమే ఆలోచించకూడదు. వ్యాక్సిన్ సేఫ్టీ, ప్రభావం గురించి కూడా గుర్తుంచుకోవాలి. అవి నిజంగా అర్థం కాని విషయాలు. ఇది నేను మాట్లాడుతుంది దీనిని రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్లను ఉద్దేశించి’

యూఎస్ లో వ్యాక్సిన్ అందడంపై పూర్తి రాజకీయ కోణం అలముకుంది. 81శాతం మంది డెమోక్రట్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అంటుంటే రిపబ్లికన్లలో కేవలం 47శాతం మాత్రమే సిద్ధంగా ఉన్నారు.



ఇక్కడ మనం కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజిలను ఫేస్ చేస్తున్నాం. యాంటీ వ్యాక్సిన్ ఆందోళనకారులంతా.. బిగ్ ఫార్మా కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్లు సమాజంలో పరిస్థితులు మార్చేస్తాయి. ప్రభుత్వం చేయదలచుకుంటే పేదరికంలో ఉన్న వారికి.. అందరిలా ఒకే రకంగా వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయి.

ఆశ్చర్యకరంగా అమెరికాలో దాదాపు యువత కరోనా వ్యాక్సిన్ కే సపోర్ట్ చేస్తున్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో దీనికి విరుద్ధంగా ఉంది. లండన్ లో 16శాతం మంది వ్యాక్సిన్ వద్దంటున్నారు. వయస్సుల వారీగా వారి కోరికలు మారుతున్నాయి. యుక్త వయస్సు వారి నుంచే వ్యాక్సిన్ వద్దనే భావన రెట్టింపుగా వినిపిస్తుంది.

వాళ్లు వద్దనడానికి కారణం సైన్స్, ప్రభుత్వం మీదా నమ్మకం లేకపోవడమే. ఈ సర్వేల్లో తేలిందేంటంటే.. వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్ కు ముగింపు కానే కాదని అనుకుంటున్నారు.


ట్రెండింగ్ వార్తలు