Israeli–Palestinian Conflict: ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిలో భారతీయులు ఎవరైనా చనిపోయారా? విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే?

ఇజ్రాయెల్‌లో జరిగిన దాడికి సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Israeli–Palestinian Conflict: ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిలో భారతీయులు ఎవరైనా చనిపోయారా? విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే?

Israeli–Palestinian Conflict: ఇజ్రాయెల్‌కు, ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ లక్ష్యంగా హమాస్ అనేక రాకెట్ దాడులను ప్రారంభించింది. అయితే, ఇజ్రాయెల్ తగిన సమాధానం ఇస్తోంది. కాగా, ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో భారతీయులు ఎవరైనా చనిపోయారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు రాలేదని భారత విదేశాంగ శాఖ గురువారం స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌లో జరిగిన దాడికి సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో గాయపడిన కేరళకు చెందిన మహిళ గురించి ఆయనను ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే మన పౌరులు తిరిగి రావడానికి వీలుగా ఆపరేషన్ అజయ్ ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. ‘‘టెల్ అవీవ్ నుంచి భారతీయులు సురక్షితంగా తిరిగి రావడానికి ఆపరేషన్ ‘అజయ్’ కింద మొదటి చార్టర్ ఫ్లైట్ ఈ రాత్రికి అక్కడికి చేరుకుంటుంది. రేపు ఉదయం భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది’’ అని అన్నారు.