నూనె కోసం చర్చిలో తొక్కిసలాట, 20మంది మృతి : పాస్టర్ సహా ఏడుగురి అరెస్ట్

టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో

  • Edited By: veegamteam , February 4, 2020 / 04:33 AM IST
నూనె కోసం చర్చిలో తొక్కిసలాట, 20మంది మృతి : పాస్టర్ సహా ఏడుగురి అరెస్ట్

టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో

టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 20మంది చనిపోవడం సంచలనమైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. 20మంది మృతికి కారణమైన పాస్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.

కిలిమంజారో పర్వతం సమీపంలోని మోషే పట్టణంలో శనివారం(ఫిబ్రవరి 01,2020) సాయంత్రం పాస్టర్ బోనిఫేస్ మంపోసా అధ్వర్యంలో జరిగిన ప్రార్థనలకు భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పాస్టర్ బోనిఫేస్ చేతిలో నూనెను(anointed oil) పట్టుకుని ప్రార్థన నిర్వహించి, దానిని నేలపై పోశాడు. భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాల్సిందిగా ఆయన పిలుపునిచ్చాడు. పవిత్రమైన ఈ నూనెను తాకితే మంచి జరుగుతుందని, రోగాలు పోతాయని భావించిన జనం.. ఒక్కసారిగా ముందుకు ఉరకడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఐదుగురు చిన్నారుల కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. రాత్రివేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వివరించారు.

తొక్కిసలాట చోటుచేసుకున్నా పాస్టర్ పట్టించుకోకుండా టాంజానియా తీర నగరం దార్ ఇస్ సలేం పట్టణంలోని మరో చర్చికి వెళ్లిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆఫ్రికాలో ప్రజల పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున్న పాస్టర్లు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాము అద్భుతాలు చేయగలమని, పేదరికం నుంచి బయటపడేస్తామని మాయమాటలు చెప్పి జనాలను మభ్యపెడుతున్నారని, ప్రాణాలు తీస్తున్నారని చెబుతున్నారు.

సువార్త సభల పేరుతో ఆర్ధిక నేరాలు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో దక్షిణాఫ్రికా నగరం ప్రిటోరియాలోని ఓ చర్చిలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఆ చర్చి ఫాస్టర్ షెఫర్డ్ బుషీరిపై కేసు నమోదైంది. షెఫర్డ్ ఆఫ్రికాలోనే అత్యంత ధనవంతుడైన క్రైస్తవ మత ప్రబోధకుడు. 2019 ఫిబ్రవరిలో షెఫర్డ్ పై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. దక్షిణాఫ్రికా నుంచి తన ప్రత్యేక విమానంలో డబ్బును అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.