USA Nurse : నర్సుకు 760ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు, ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

నర్సు బాధితుల్లో కొందరు వృద్ధులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఎవరూ చనిపోవడానికి సిద్ధంగా లేరని పేర్కొంది.

USA Nurse : నర్సుకు 760ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు, ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

USA Nurse Jailed (Photo Credit : Google)

USA Nurse : అమెరికాలోని స్థానిక కోర్టు ఓ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. హీథర్ ప్రెస్ డీ అనే నర్సుకు 700ఏళ్లకు పైగా (గరిష్టంగా 760ఏళ్లు) జైలు శిక్ష విధించింది. హీథర్ ప్రెస్ డీ వయసు 41ఏళ్లు. ఆమె పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి వారి మరణానికి కారణమైంది. 2020-23 మధ్య 22 మందికి హైడోస్ ఇచ్చినట్లు దర్యాఫ్తులో తేలింది. వీరిలో ముగ్గురి మరణాలకు హీథర్ దోషిగా తేలింది. మరో 19మందిపై హత్యాయత్నం కింద కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగానే నర్సు ఇలా చేసినట్లు దర్యాఫ్తులో తెలిసింది.

హీథర్ ప్రెస్ డీ పెన్సిల్వేనియాలో నర్సుగా పని చేస్తుంది. రోగులకు ప్రాణాంతకమైన ఇన్సులిన్ మోతాదులను అందించినందుకు వరుసగా మూడు జీవిత ఖైదులను కోర్టు విధించింది.

పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్లర్ కౌంటీలోని కోర్టులో కేసు విచారణ జరిగింది. 2020-2023 మధ్య నాలుగు కౌంటీలలో ఐదు ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 17 మంది రోగుల మరణాల్లో ఆమె పాత్ర ఉందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. బాధితుల వయస్సు 43 నుండి 104 వరకు ఉందని వెల్లడించారు.

చాలా మంది రోగులు ఇన్సులిన్ మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. ప్రాథమిక అభియోగాలు నమోదు కావడంతో ఆమె నర్సింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయబడింది. మే 2023లో ఇద్దరు నర్సింగ్‌హోమ్ రోగులను చంపి, మూడో వ్యక్తిని గాయపరిచినట్లు ఆమెపై మొదట అభియోగాలు మోపారు. నర్సు బాధితుల్లో కొందరు వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఎవరూ చనిపోవడానికి సిద్ధంగా లేరని పేర్కొంది. నర్సు హీథర్ చేసిన పని సంచలనంగా మారింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఆమె మనిషి రూపంలో ఉన్న దెయ్యం అంటూ విచారణ సమయంలో ప్రాసిక్యూటర్ అన్నారు.